తిరిగివచ్చిన విద్యార్థులకు ఇక్కడ సీట్లు ఇవ్వండి " విజయసాయిరెడ్డి విజ్ఞప్తి
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశం నుంచి తిరిగొచ్చిన భారత వైద్య విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వారి చదువు మన దేశంలోని విద్యాసంస్థల్లోనే కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి.. ఆ విద్యార్థులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కోరారు. రాజ్యసభలో ఈ అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలాదిమంది మంది భారతీయ విద్యార్థులను క్షేమంగా మాతృదేశానికి తీసుకురావడానికి కేంద్రం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఉక్రెయిన్ […]
రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశం నుంచి తిరిగొచ్చిన భారత వైద్య విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వారి చదువు మన దేశంలోని విద్యాసంస్థల్లోనే కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి.. ఆ విద్యార్థులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కోరారు. రాజ్యసభలో ఈ అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలాదిమంది మంది భారతీయ విద్యార్థులను క్షేమంగా మాతృదేశానికి తీసుకురావడానికి కేంద్రం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు.
ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్ధులు ఇప్పుడు అర్థాంతరంగా నిలిచిపోయిన తమ చదువులతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని, ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే పరిస్థితులు కనిపించడం లేదన్నారు విజయసాయిరెడ్డి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మానవతా దృక్పథంతో, ఒక అరుదైన కేసుగా పరిగణిస్తూ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికల్ విద్యార్ధులు మనదేశంలోని యూనివర్శిటీలలో తమ చదువును కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏదైనా మెడికల్ కళాశాల మూతబడినప్పుడు విద్యార్థులను వివిధ కళాశాల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తోంది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్థుల విషయంలో కూడా ప్రభుత్వం అలాంటి ఒక ప్రత్యేక బదిలీ విధానాన్ని రూపొందించాలని విజయసాయిరెడ్డి కోరారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చక్కబడే వరకు తాత్కాలికంగా వారు ఇక్కడి వైద్య కళాశాలల్లో విద్యను కొనసాగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విజయసాయిరెడ్డి.