ప్రేమ చూపిస్తే ఫైట్ అడుగుతారేంటి?
పూర్తిస్థాయి ప్రేమకథగా తెరకెక్కింది రాధేశ్యామ్ మూవీ. కాకపోతే ఇందులో ఓ ఫైట్ పెట్టడానికి కావాల్సిన సందర్భం, సౌకర్యం, సరంజామా అన్నీ ఉన్నాయి. కానీ మేకర్స్ అక్కడ ఫైట్ పెట్టలేదు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో కనీసం ఆ ఒక్క సందర్భంలోనైనా చిన్న ఫైట్ పెట్టి ఉంటే బాగుండేదని తమ అసంతృప్తిని సోషల్ మీడియాలో వెల్లగక్కుతున్నారు. దీనిపై యూనిట్ స్పందించింది. రాధేశ్యామ్ సక్సెస్ మీట్ ఏర్పాటుచేశారు ఈరోజు. తమన్, దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడారు. […]
పూర్తిస్థాయి ప్రేమకథగా తెరకెక్కింది రాధేశ్యామ్ మూవీ. కాకపోతే ఇందులో ఓ ఫైట్ పెట్టడానికి కావాల్సిన సందర్భం, సౌకర్యం, సరంజామా అన్నీ ఉన్నాయి. కానీ మేకర్స్ అక్కడ ఫైట్ పెట్టలేదు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో కనీసం ఆ ఒక్క సందర్భంలోనైనా చిన్న ఫైట్ పెట్టి ఉంటే బాగుండేదని తమ అసంతృప్తిని సోషల్ మీడియాలో వెల్లగక్కుతున్నారు. దీనిపై యూనిట్ స్పందించింది.
రాధేశ్యామ్ సక్సెస్ మీట్ ఏర్పాటుచేశారు ఈరోజు. తమన్, దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడారు. ఈ ఫైట్ ఎలిమెంట్ కూడా చర్చకొచ్చింది. దీనిపై తమన్ సెటైరిక్ గా మాట్లాడాడు. ప్రేమకథలో ఫైట్ సీన్ పెట్టకూడదన్న తమన్.. సాహో సినిమాలో లవ్ లేదన్నారు, రాధేశ్యామ్ లో ఫైట్ లేదంటున్నారు. అంటూ సెటైర్లు వేశాడు.
ఇక సినిమా కాస్త నెమ్మదిగా సాగుతుందనే విమర్శపై కూడా వ్యంగ్యంగా స్పందించాడు తమన్. సినిమా స్పీడ్ గా తీయడం ఎలాగో నేర్చిస్తే నేర్చుకుంటానన్నాడు. అయినా ఓ సినిమా స్లోగా ఉందని ఎలా చెబుతారని రివర్స్ లో స్పందించిన తమన్.. క్రిటిక్స్ కోసం ఓ స్కూల్ ఉంటే బాగుంటుందని, విమర్శకులంతా అక్కడికెళ్లి పాఠాలు నేర్చుకోవాలంటూ జోకులేశాడు.
నిన్న రిలీజైన రాధేశ్యామ్ సినిమాకు నెగెటివ్ రివ్యూస్ పడ్డాయి. సినిమా బాగాలేదంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాధేశ్యామ్ వసూళ్లు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.