రాధేశ్యామ్ మొదటి రోజు వసూళ్లు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు పాన్ ఇండియా అంతటా భారీ వసూళ్లు వచ్చాయి. నిన్న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా దేశవ్యాప్తంగా 79 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఏపీ+నైజాంలో ఈ సినిమాకు ఫస్ట్ డే 25 కోట్ల 49 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నిజానికి తొలిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల రూపాయల వసూళ్లు అంచనా […]

Advertisement
Update:2022-03-12 12:29 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు పాన్ ఇండియా అంతటా భారీ వసూళ్లు వచ్చాయి. నిన్న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా దేశవ్యాప్తంగా 79 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఏపీ+నైజాంలో ఈ సినిమాకు ఫస్ట్ డే 25 కోట్ల 49 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

నిజానికి తొలిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల రూపాయల వసూళ్లు అంచనా వేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న కారణాల వల్ల కలెక్షన్లు తగ్గాయి. ఇటు నైజాంలో కూడా ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల షేర్ అంచనా వేశారు. 10 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. కీలకమైన కొన్ని థియేటర్లను ఇంకా భీమ్లానాయక్ సినిమా కోసం అట్టిపెట్టి ఉంచడమే ఈ వసూళ్ల తగ్గుదలకు కారణం.

అటు ఓవర్సీస్ లో మాత్రం రాధేశ్యామ్ పెద్ద హిట్టయింది. మొదటి రోజే ప్రీమియర్స్ తో కలుపుకొని ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది. మొత్తం వసూళ్లు 1.3 మిలియన్ డాలర్లు (9 కోట్లకు పైగా) వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ 10.80 కోట్లు
సీడెడ్ – రూ. 3.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.95 కోట్లు
ఈస్ట్ – రూ. 2.60 కోట్లు
వెస్ట్ – రూ. 2.01 కోట్లు
గుంటూరు – రూ. 2.60 కోట్లు
నెల్లూరు – రూ 1.08 కోట్లు
కృష్ణా – రూ. 0.95 కోట్లు

Tags:    
Advertisement

Similar News