ఏజెంట్ వచ్చే తేదీ తెలిసిపోయింది

హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించారు. `ఏజెంట్` చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోంది కాబట్టి, స్వాతంత్ర […]

Advertisement
Update:2022-03-12 12:17 IST

హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించారు. 'ఏజెంట్' చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోంది కాబట్టి, స్వాతంత్ర దినోత్సవం విడుదలకు అనువైన సమయంగా భావించారు. అంతేకాక ఆగస్ట్ 15వ తేదీ సోమవారం కావడంతో 4 రోజుల వీకెండ్ కూడా కలిసి వచ్చింది.

'ఏజెంట్'లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో అతనిలోని సరికొత్త షేడ్ కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాలో మమ్ముట్టి కూడా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.
సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిళ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News