సక్సెస్ కు భాషతో సంబంధం లేదంటున్న హీరోయిన్

సక్సెస్ కు భాషతో సంబంధం లేదంటోంది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఎంచుకున్న కథలే సక్సెస్ తెచ్చిపెడతాయని, ఈ విషయంలో టాలీవుడ్-కోలీవుడ్ అనే తేడా చూడకూడదంటోంది. టాలీవుడ్ లో ఫెయిల్ అయిన ఈ హీరోయిన్, కోలీవుడ్ లో సక్సెస్ అయింది. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నిస్తే, ఇలా స్పందించింది. “త‌మిళంలో ముందు డాక్ట‌ర్ చేశా. అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. నా కెరీర్‌కు అది గుడ్ సైన్ ఇచ్చింది. ఇ.టి. సినిమా కూడా అంత‌కంటే గుర్తింపు ఇస్తుంది. బాష […]

Advertisement
Update:2022-03-10 02:38 IST

సక్సెస్ కు భాషతో సంబంధం లేదంటోంది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఎంచుకున్న కథలే సక్సెస్ తెచ్చిపెడతాయని, ఈ విషయంలో టాలీవుడ్-కోలీవుడ్ అనే తేడా చూడకూడదంటోంది. టాలీవుడ్ లో ఫెయిల్ అయిన ఈ హీరోయిన్, కోలీవుడ్ లో సక్సెస్ అయింది. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నిస్తే, ఇలా స్పందించింది.

“త‌మిళంలో ముందు డాక్ట‌ర్ చేశా. అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. నా కెరీర్‌కు అది గుడ్ సైన్ ఇచ్చింది. ఇ.టి. సినిమా కూడా అంత‌కంటే గుర్తింపు ఇస్తుంది. బాష బేరియ‌ర్ వుండ‌దు అంటారు. ఏమంచి సినిమా చేసినా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే డాక్ట‌ర్ తెలుగులోనూ విడుద‌లై చూపించింది. అదేవిధంగా పుష్ప‌కూడా చిత్తూరు యాస‌ నార్త్‌లో తెలీదు. కానీ డ‌బ్బింగ్‌లో ఆక‌ట్టుకునేలా చెప్ప‌డంతో అక్క‌డ నీరాజ‌నాలు ప‌లికారు. తెలుగులో ఆడ‌క‌పోయినా త‌మిళంలో నాకు మంచి గుర్తింపు వుంది. ఇ.టి. రెండు చోట్ల ఆ గుర్తింపు తెస్తుంద‌ని న‌మ్ముతున్నాను.”

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ తనకు ఎలాంటి బాధ లేదని, తమిళ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నానని చెబుతోంది ఈ బ్యూటీ.

ఈమె నటించిన తాజా చిత్రం ఈటీ. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ఈరోజు తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిజల్ట్, ఈ హీరోహీరోయిన్లు ఇద్దరికీ చాలా కీలకం.

Tags:    
Advertisement

Similar News