ఖిలాడీ క్లోజింగ్ కలెక్షన్స్.. దారుణ ఫలితం

రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమా ఫైనల్ రన్ ముగిసింది. క్లోజింగ్ కలెక్షన్లలో భాగంగా ఈ సినిమా బయ్యర్లకు సగానికి పైగా నష్టాలు మిగిల్చింది. అంకెల్లో చూసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఖిలాడీ సినిమా 23 కోట్ల 50 లక్షల రూపాయ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా.. క్లోజింగ్ లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 13 కోట్ల 70 లక్షల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది. అంటే అటుఇటుగా 10 కోట్ల రూపాయల నష్టం అన్నమాట. రమేష్ వర్మ దర్శకత్వంలో […]

Advertisement
Update:2022-03-09 16:56 IST

రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమా ఫైనల్ రన్ ముగిసింది. క్లోజింగ్ కలెక్షన్లలో భాగంగా ఈ సినిమా బయ్యర్లకు సగానికి పైగా నష్టాలు మిగిల్చింది. అంకెల్లో చూసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఖిలాడీ సినిమా 23 కోట్ల 50 లక్షల రూపాయ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా.. క్లోజింగ్ లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 13 కోట్ల 70 లక్షల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది. అంటే అటుఇటుగా 10 కోట్ల రూపాయల నష్టం అన్నమాట.

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. రిచ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కంటెంట్ లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. దీనికితోడు ఈ సినిమాతో పాటు వచ్చిన డీజే టిల్లూ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేయడంతో ఖిలాడీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆ తర్వాత భీమ్లానాయక్ రాకతో ఖిలాడీని ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయారు.

అలా మొదటి రోజుకే చతికిలపడిన ఈ సినిమా, రెండో రోజు నుంచి కోలుకోలేకపోయింది. మొదటి వారాంతం ఓ మోస్తరు వసూళ్లతో గట్టెక్కిన ఈ సినిమా, రెండో వారాంతానికి క్లియర్ ఫ్లాప్ అనిపించుకుంది. ఆ తర్వాత 2 వారాలకు వసూళ్లలో డిజాస్టర్ అనిపించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖిలాడీ సినిమాకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 4.07 కోట్లు
సీడెడ్ – రూ. 1.93 కోట్లు
ఉత్తరాంద్ర – రూ. 1.62 కోట్లు
ఈస్ట్ – 85 లక్షలు
వెస్ట్ – 67 లక్షలు
గుంటూరు – రూ. 1.14 కోట్లు
నెల్లూరు – 56 లక్షలు
కృష్ణా – 69 లక్షలు

Tags:    
Advertisement

Similar News