4 లక్షల మంది బాలికలకోసం.. మళ్లీ బడికి..

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి అనే నియమం పెట్టుకున్నా.. భారత్ లో స్కూల్ మానేసే పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే సమయంలో కరోనా ప్రభావంతో ఆ సంఖ్య రెట్టింపయింది. అందులోనూ ఆడ పిల్లలు ఎక్కువగా కరోనా కాలంలో బడిమానేసి ఇంటి పట్టునే ఉంటున్నారనే విషయం పలు సర్వేలలో బయటపడింది. అలాంటి వారందర్నీ తిరిగి బడికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలతో సక్షమ్ పథకాన్ని అమలులోకి తెస్తోంది. ఇప్పటి వరకూ 11నుంచి 14 ఏళ్ల లోపువారిపై […]

Advertisement
Update:2022-03-08 02:53 IST

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి అనే నియమం పెట్టుకున్నా.. భారత్ లో స్కూల్ మానేసే పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే సమయంలో కరోనా ప్రభావంతో ఆ సంఖ్య రెట్టింపయింది. అందులోనూ ఆడ పిల్లలు ఎక్కువగా కరోనా కాలంలో బడిమానేసి ఇంటి పట్టునే ఉంటున్నారనే విషయం పలు సర్వేలలో బయటపడింది. అలాంటి వారందర్నీ తిరిగి బడికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలతో సక్షమ్ పథకాన్ని అమలులోకి తెస్తోంది. ఇప్పటి వరకూ 11నుంచి 14 ఏళ్ల లోపువారిపై ఎక్కువ దృష్టి పెట్టగా.. ఇకపై 14నుంచి 18 ఏళ్ల లోపు వారిని కూడా తిరిగి స్కూల్స్ కి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అంగన్వాడీలు, జిల్లా విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ఈ పథకాన్ని అమలులోకి తెస్తున్నారు. బాలికలను అంగన్వాడీ స్కూల్ లో చేర్పించి, ఆ తర్వాత వారిని రెగ్యులర్ స్కూల్ లో చేర్పించేందుకు గాను… ఒక్కో బాలిక కోసం రూ.500 నుంచి రూ.1000 రూపాయలు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. ఈ ఖర్చుని పారితోషికం రూపంలో అంగ్వాడీలకు చెల్లిస్తారు. మొత్తం 4 లక్షలమంది బాలికలను తిరిగి స్కూల్స్ కి రప్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

కరోనా కాలంలో స్కూల్స్ ని తిరిగి ప్రారంభిస్తే కేవలం 90 శాతం మంది మాత్రమే చదువుని కొనసాగించారని సర్వేలు చెబుతున్నాయి. ఆడ పిల్లలను ఇంటి పనులకు పరిమితం చేయడమో, లేక వివాహం జరిపించి అత్తగారింటికి పంపించడమో చేశారు తల్లిదండ్రులు. అలాంటివారిపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. వారందర్నీ తిరిగి స్కూల్స్ కి రప్పించడం కోసం అంగన్వాడీ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News