చరణ్ కూడా సూట్ కేస్ సర్దేశాడు

కరోనా కేసులు ఇలా తగ్గుముఖం పట్టాయో లేదో అలా సెలబ్రిటీలంతా విహార యాత్రలకు బయల్దేరారు. పైగా ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవ్వడంతో, బీచ్ రిసార్ట్ లకు క్యూ కట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు తమ కుటుంబాలతో కలిసి హాలిడే చుట్టి వచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. హీరో రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసనతో కలిసి హాలిడే ట్రిప్ కు బయల్దేరాడు. అయితే చరణ్ […]

Advertisement
Update:2022-03-08 02:26 IST

కరోనా కేసులు ఇలా తగ్గుముఖం పట్టాయో లేదో అలా సెలబ్రిటీలంతా విహార యాత్రలకు బయల్దేరారు. పైగా ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవ్వడంతో, బీచ్ రిసార్ట్ లకు క్యూ కట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు తమ కుటుంబాలతో కలిసి హాలిడే చుట్టి వచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది.

హీరో రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసనతో కలిసి హాలిడే ట్రిప్ కు బయల్దేరాడు. అయితే చరణ్ ఎక్కడ ల్యాండ్ అయ్యాడనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. చరణ్ హాలీడే ట్రిప్ వెనక ఓ గమ్మత్తైన విషయం ఉంది.

దాదాపు రెండేళ్లుగా రామ్ చరణ్ తన భార్యకు టైమ్ కేటాయించలేదు. కరోనా కేసులు ఓవైపు, ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకోవైపు ఉండడంతో ఎలాంటి విహార యాత్రలు పెట్టుకోలేదు. త్వరలోనే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ మరోసారి స్టార్ట్ అవ్వబోతోంది. ఈలోగా టూర్ కంప్లీట్ చేయకపోతే మళ్లీ కష్టం. అందుకే హుటాహుటిన భార్యను తీసుకొని రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయాడు మిస్టర్-సి.

ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. చరణ్ విహారయాత్ర నుంచి వచ్చిన వెంటనే మరో కొత్త షెడ్యూల్ ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News