తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన మలయాళ మెగాస్టార్
హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి మొదటిసారి గా భారీ బడ్జెట్ తో స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్` కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అఖిల్ ని మునుపెన్నడూ చూడని డాషింగ్ లుక్ లో ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. ఏజెంట్ లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో సరికొత్త గా కనిపిస్తాడు. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కథానాయిక గా కొత్త […]
హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి మొదటిసారి గా భారీ బడ్జెట్ తో స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అఖిల్ ని మునుపెన్నడూ చూడని డాషింగ్ లుక్ లో ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. ఏజెంట్ లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో సరికొత్త గా కనిపిస్తాడు.
స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కథానాయిక గా కొత్త నటి సాక్షి వైద్య ఎంపికైంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టిన అఖిల్, సైరా సక్సెస్ తర్వాత సురేందర్ రెడ్డి, సూపర్ హిట్ స్టోరీ రైటర్ వక్కంతం కలవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడీ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఎంటరయ్యారు. ఈ సినిమాలో పూర్తి నిడివి గల ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు మమ్ముట్టి.
ఏజెంట్ తాజా షెడ్యూల్ నిన్న ప్రారంభమయింది. ఇందులో మమ్ముట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మమ్ముట్టి పోస్టర్ను విడుదల చేసారు. 'ద డెవిల్ రూత్ లెస్ సేవియర్' అంటూ ఇంట్రెస్టింగ్ కాప్షన్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.