ఆడవాళ్లు మీకు జోహార్లు మొదటి రోజు వసూళ్లు
శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల డైరక్ట్ చేసిన ఈ సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకు చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీనికి రెండు కారణాలు. వరుసగా ఫ్లాపులిస్తున్న శర్వానంద్, తన మార్కెట్ ను కొద్దిగా కోల్పోయాడు. ఇక మరో కారణం, భీమ్లానాయక్ వల్ల ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. ఈ రెండు కారణాల వల్ల ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు […]
శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల డైరక్ట్ చేసిన ఈ సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకు చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీనికి రెండు కారణాలు. వరుసగా ఫ్లాపులిస్తున్న శర్వానంద్, తన మార్కెట్ ను కొద్దిగా కోల్పోయాడు. ఇక మరో కారణం, భీమ్లానాయక్ వల్ల ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. ఈ రెండు కారణాల వల్ల ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు వసూళ్లు తగ్గాయి
తొలి రోజు ఈ సినిమాకు కోటి 57 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 14 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అచ్చంగా 12 కోట్ల 50 లక్షలు కావాలి. ఈ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఈ టాక్ తో, తక్కువ థియేటర్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
రష్మిక గోల్డెన్ హ్యాండ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. వరుసగా హిట్లు కొడుతున్న ఈ బ్యూటీ.. చాన్నాళ్ల తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ఫ్లాప్ అందుకుంది. రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాను కాపాడలేకపోయారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాత. తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 72 లక్షలు
సీడెడ్ – 18 లక్షలు
ఉత్తరాంధ్ర – 20 లక్షలు
ఈస్ట్ – 9 లక్షలు
వెస్ట్ – 8 లక్షలు
గుంటూరు – 12 లక్షలు
కృష్ణా – 11 లక్షలు
నెల్లూరు – 7 లక్షలు