రామారావు ఆన్ డ్యూటీ టీజర్ ఎలా ఉందంటే?

సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా `రామారావు ఆన్ డ్యూటీ`. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాస్ రాజా రవితేజ హీరో. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. 2 పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. మహా శివరాత్రి సందర్భంగా ఈరోజు రామారావు ఆన్ డ్యూటీ టీజర్ రిలీజ్ చేశారు. రవితేజ సిన్సియర్ డ్యూటీ మైండెడ్ డిప్యూటీ కలెక్టర్‌గా చురుకైన పాత్రలో […]

Advertisement
Update:2022-03-01 14:45 IST

సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాస్ రాజా రవితేజ హీరో. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. 2 పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.

మహా శివరాత్రి సందర్భంగా ఈరోజు రామారావు ఆన్ డ్యూటీ టీజర్ రిలీజ్ చేశారు. రవితేజ సిన్సియర్ డ్యూటీ మైండెడ్ డిప్యూటీ కలెక్టర్‌గా చురుకైన పాత్రలో క‌న్పిస్తున్నాడు. అతను చట్టానికి విరుద్ధంగా వున్న ఎవరినీ లెక్క‌చేయ‌డు. మరొక వైపు మంచి చేయ‌డానికి వెనుకాడ‌ని కోణం కూడా టీజర్ లో క‌నిపిస్తుంది.

మాస్‌ని ఆకట్టుకునేలా, టీజర్‌లో పుష్కలంగా యాక్షన్ స‌న్నివేశాలు ఉన్నాయి. రవితేజ ఆద్యంతం ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. హీరోయిన్లిద్దరూ హోమ్లీ గెటప్స్ లో కనిపించారు. వేణు తొట్టెంపూడి క్యారెక్టర్‌ ని కూడా టీజర్ లో పరిచయం చేశారు.

నిజానికి టీజర్‌లో కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రత్యేకించి, రవితేజ చెప్పిన “నేరస్తులకు త‌ప్ప‌కుండా శిక్ష ప‌డుతుంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా స‌రే” అని ర‌వితేజ‌ చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది.

Full View

Tags:    
Advertisement

Similar News