భోళాశంకర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఈ మూవీకి సంబంధించి స్వాగ్ ఆఫ్ భోళా అంటూ ఇప్పటికే ఓ లుక్ రిలీజ్ చేశారు. దాన్ని ప్రీ-లుక్ అన్నారు. ఇప్పుడు వైబ్ ఆఫ్ భోళా అంటూ మరో లుక్ రిలీజ్ చేశారు. దీన్ని ఫస్ట్ లుక్ అంటున్నారు. ప్రీ-లుక్ లో చిరంజీవిని క్లోజ్ లో చూపిస్తే, ఫస్ట్ లుక్ లో చిరంజీవి టోటల్ లుక్ ను రివీల్ చేశారు. జీపు ముందుభాగంలో కూర్చొని త్రిశూలం ఉన్న చైన్ ను […]
చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఈ మూవీకి సంబంధించి స్వాగ్ ఆఫ్ భోళా అంటూ ఇప్పటికే ఓ లుక్ రిలీజ్ చేశారు. దాన్ని ప్రీ-లుక్ అన్నారు. ఇప్పుడు వైబ్ ఆఫ్ భోళా అంటూ మరో లుక్ రిలీజ్ చేశారు. దీన్ని ఫస్ట్ లుక్ అంటున్నారు. ప్రీ-లుక్ లో చిరంజీవిని క్లోజ్ లో చూపిస్తే, ఫస్ట్ లుక్ లో చిరంజీవి టోటల్ లుక్ ను రివీల్ చేశారు.
జీపు ముందుభాగంలో కూర్చొని త్రిశూలం ఉన్న చైన్ ను తిప్పుతున్న లుక్ ను భోళాశంకర్ ఫస్ట్ లుక్ కింద రిలీజ్ చేశారు. లుక్ చూస్తుంటే, అటు కంప్లీట్ మాస్ గా కాకుండా, ఇటు పూర్తి క్లాస్ గా కాకుండా మధ్యస్తంగా చిరంజీవి గెటప్ ను డిజైన్ చేసినట్టుంది. శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆచార్య పూర్తయిన వెంటనే భోళాశంకర్ స్టార్ట్ చేశారు చిరంజీవి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. చిరంజీవితో పాటు వెన్నెల కిషోర్, రావు రమేశ్, మురళీ శర్మ లాంటి నటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.
బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ తో వస్తోంది భోళాశంకర్. ఇందులో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఇక చిరంజీవి సరసన హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గతంలో చిరంజీవికి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు మణిశర్మ. ఇప్పుడు మహతి స్వరసాగర్ తొలిసారి చిరంజీవి సినిమాకు వర్క్ చేస్తున్నాడు.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. ఆచార్య థియేటర్లలోకి వచ్చిన వెంటనే, భోళాశంకర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.