సెబాస్టియన్ ట్రయిలర్ రివ్యూ

కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నివేక్ష (నమ్రతా దరేకర్‌) నటీనటులుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా సెన్సేనల్ హీరో విజయదేవరకొండ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశాడు. సెబాస్టియన్ కు […]

Advertisement
Update:2022-02-28 15:24 IST

కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నివేక్ష (నమ్రతా దరేకర్‌) నటీనటులుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా సెన్సేనల్ హీరో విజయదేవరకొండ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశాడు.

సెబాస్టియన్ కు రేచీకటి. కానీ ఆ విషయాన్ని అతడు దాస్తాడు. అలా దాచి కానిస్టేబుల్ ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత అతడికి కష్టాలు తప్పలేదు. నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. కొన్నాళ్లు మేనేజ్ చేస్తాడు. కానీ ఓసారి మదనపల్లిలో ఓ క్రైమ్ జరుగుతుంది. అదే టైమ్ లో సెబాస్టియన్ నైట్ డ్యూటీలో ఉంటాడు. ఆ కేసును ఛేదించలేని పోలీసులు, సెబాస్టియన్ ను సస్పెండ్ చేస్తారు. ఈ కేసు నుంచి సెబాస్టియన్ ఎలా బయటపడ్డాడు? తిరిగి తన ఉద్యోగాన్ని ఎలా సంపాదించుకున్నాడు? రేచీకటి అనే బలహీనతను ఎలా అధిగమించాడు అనేది ఈ సినిమా స్టోరీ.

సెబాస్టియన్ గా, రేచీకటి బాధితుడిగా కిరణ్ అబ్బవరం చాలా బాగా చేశాడు. హీరోయిన్లు కోమలీ ప్రసాద్, నివేక్ష చూడ్డానికి అందంగా ఉన్నారు. ట్రయిలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జిబ్రాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రెండున్నర గంటల సేపు అందరినీ కట్టిపడేసే కథనంతో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు మేకర్స్. మదనపల్లెలో కేవలం 32 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేశారు.

Full View

Tags:    
Advertisement

Similar News