సరదా సరదాగా 'ఆడవాళ్లు'

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా అంగీకరించడానికి కారణాల్ని బయటపెట్టింది రష్మిక. బాలీవుడ్, టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ, కాల్షీట్లు లేనప్పటికీ శర్వానంద్ సినిమా చేయడానికి అంగీకరించానంటోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రష్మిక.. మరిన్ని విశేషాల్ని బయటపెట్టింది. – ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత […]

Advertisement
Update:2022-02-28 15:17 IST

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా అంగీకరించడానికి కారణాల్ని బయటపెట్టింది రష్మిక. బాలీవుడ్, టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ, కాల్షీట్లు లేనప్పటికీ శర్వానంద్ సినిమా చేయడానికి అంగీకరించానంటోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రష్మిక.. మరిన్ని విశేషాల్ని బయటపెట్టింది.

– ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకతనే మొదట కలిగింది. ఆ పాత్రలకు ఎవరెవరిని అనుకుంటున్నారో చెప్పాక సంతోషపడ్డాను. ఈ సినిమా ప్రధానంగా ఇంటర్వెల్ సీన్ ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా ఎలాగైనా చేయాలని అనిపించింది.

– ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య. ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు. సినిమా నిండా ఆడవాళ్లమే ఉంటాం కాబట్టి సెట్ లో మగవాళ్లంతా మమ్మల్ని చూసి ..వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో అంటూ ఇబ్బంది పడేవారు. – ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్నీ డైలాగ్ ప్రధానంగా సాగుతుంటాయి. అందరూ మాట్లాడుతుంటారు. అవన్నీ మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నట్లు సహజంగా ఉంటాయి.

– శర్వానంద్ తో కలిసి నటించడం హ్యాపీ. నేను పుష్ప సెట్ లో నుంచి ఆడవాళ్లు..షూట్ కు వచ్చినప్పుడు చాలా రిలాక్స్ అయ్యేదాన్ని. అక్కడ అడవుల్లో షూటింగ్ చేసి ఇక్కడికొస్తే పిక్నిక్ లా అనిపించేది. ఇంటి నుంచి శర్వా ఫుడ్ తెచ్చి పెట్టేవాడు. ఒక ఫ్యామిలీలా అంతా కలిసి ట్రావెల్ చేశాం. శర్వాను మిగతా ఆడవాళ్లు ఈ సినిమాలో ఇబ్బంది పెడుతుంటారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను. అంతమంది మహిళల మధ్య ఆయన ఎలా వ్యవహరించారు అనేది సినిమాలో చూడాలి. చాలా ఫన్ గా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News