సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్
భీమ్లానాయక్ సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ కు ఓ సక్సెస్ ఇచ్చాననే ఆనందం అతడిలో కనిపిస్తోంది. ఈరోజు జరిగిన సక్సెస్ మీట్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. భీమ్లానాయక్ జర్నీ, ఆ రీమేక్ కథను తను చూసిన కోణాన్ని బయటపెట్టాడు. – “మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పబడింది. భీమ్లానాయక్ వైపు తీసుకురావడానికి ఎలా బ్యాలన్స్ చేయాలి” ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పుడు మాకు […]
భీమ్లానాయక్ సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ కు ఓ సక్సెస్ ఇచ్చాననే ఆనందం అతడిలో కనిపిస్తోంది. ఈరోజు జరిగిన సక్సెస్ మీట్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. భీమ్లానాయక్ జర్నీ, ఆ రీమేక్ కథను తను చూసిన కోణాన్ని బయటపెట్టాడు.
– “మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పబడింది. భీమ్లానాయక్ వైపు తీసుకురావడానికి ఎలా బ్యాలన్స్ చేయాలి” ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పుడు మాకు ఎదురైన తొలి సవాల్ ఇది. కథను ఎలా మార్చుకురావాలి అన్న దానిపై మా చర్చలు మొదలయ్యాయి. మాతృక నుంచి బయటకు రావడానికి మేం చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి భీమ్లా అయినా ఉండాలి.. లేదా డ్యాని అయినా ఉండాలి… లేదంటే ఇద్దరూ ఫ్రేమ్‌లో ఉండాలి. అందుకే క్లైమాక్స్ వచ్చేసరికి ఇద్దరూ ఉండేలా చేశాం. భీమ్లా భార్య పెరగమంటుంది. డ్యాని భార్య తగ్గమంటుంది.. సరిగ్గా గమనిస్తే ప్రతి సీన్‌కు కౌంటర్ ఉంటుంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నుంచి బయటకు రావడానికి ఇవన్నీ చేశాం.
– పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్‌తో సినిమా అంటే చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన్ని ఎలివేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఆర్టిఫియల్‌గా ఉండకూడదు. అభిమానులు ప్రేక్షకులు కోరుకునే అంశాలు మిస్ కాకుండా ఉండాలి. అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి మేం ఎక్కువ కష్టపడ్డాం. ఆ తర్వాత అన్ని ఈజీగా జరిగిపోయాయి. కరోనా ఒక్కటే మాకు గ్యాప్ వచ్చేలా చేసింది.
– అభిమానులు మెచ్చేలా పవన్‌ని తెరపై చూపించడానికి సాగర్ చాలా కష్టపడ్డారు. తనకి సపోర్ట్‌గా మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పాం. కల్యాణ్‌గారికి తను చెప్పలేని విషయాలను వారధిలా ఉండి మేం చెప్పాం. కొవిడ్ సమయంలో పవన్ కల్యాణ్, రానా ఎలాంటి భయం లేకుండా జనాల మధ్య పనిచేశారు.
– సాగర్‌కు వచ్చిన ఐడియాతోనే మొగిలయ్యతో టైటిల్ సాంగ్ పాడించాం. ఆయనకు పద్మశ్రీ రావడం.. ఎంతో ఆనందం కలిగించింది. జానపద కళాకారులతో అనుకుని పాడించలేదు. అలా కుదిరాయంతే.