నా సినిమాలో హీరో క్లాస్ గానే ఉంటాడు

జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాధాకృష్ణ కుమార్. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించి, ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి రాధాకృష్ణకుమార్ ఏమంటున్నాడో చూద్దాం – జ్యోతష్య శాస్త్రంపై ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. కానీ పాయింట్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యేది. ఇది యూనివర్సల్‌ పాయింట్‌. దీని బ్యాక్‌డ్రాప్‌లో కథ అనుకున్నప్పుడు చాలా […]

Advertisement
Update:2022-02-27 12:07 IST

జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాధాకృష్ణ కుమార్. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించి, ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి రాధాకృష్ణకుమార్ ఏమంటున్నాడో చూద్దాం

– జ్యోతష్య శాస్త్రంపై ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ. కానీ పాయింట్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యేది. ఇది యూనివర్సల్‌ పాయింట్‌. దీని బ్యాక్‌డ్రాప్‌లో కథ అనుకున్నప్పుడు చాలా అధ్యయనాలు చేశాను. ఈ కథను ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకునే రెడీ చేసుకున్నా. మొదట మన దేశంలోనే ఏదైనా ఒక ప్రాధాన్యత ఉన్న ప్లేస్‌ను బేస్‌ చేసుకుని చేద్దాం అనుకున్నా. కానీ ప్రభాస్‌ గారి సూచన మేరకు యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌గా మారింది.

– సాహోతో పార్లల్‌గా రాధేశ్యామ్‌ కొంత సాగింది. అయితే కోవిడ్‌ ప్రభావంతో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవం. మళ్లీ షూటింగ్‌ మొదలు పెట్టగానే నాకు, మా కెమెరామెన్‌కు కూడా కోవిడ్‌ వచ్చింది. దాంతో యూనిట్‌ అంతా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాం. లాక్‌డౌన్‌ వల్ల యూరప్‌ షెడ్యూల్‌ను మధ్యలోనే ఆపేసి.. వేరే దేశాల మీదుగా మొత్తానికి ఇళ్లకు చేరాం.

– నా సినిమాల్లో హీరోలను క్లాస్‌గానే చూపించాలి అనుకుంటా. కృష్ణంరాజుగారిది ఓ ప్రత్యేకమైన పాత్ర. దానికి ఆయనే కరెక్ట్‌ అని రేపు ప్రేక్షకులు అంటారు. పూజా హెగ్డే, ప్రభాస్‌లకు ఇది టైలర్‌ మేడ్‌ క్యారెక్టర్స్‌ అనుకోవచ్చు. పూజాకు మంచి పెరఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్ర. పాటలకు వేరే వేరే సంగీత దర్శకులు పనిచేసినా.. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం థమన్‌ గారు చేయడం సినిమా లెవల్‌ను ఖచ్చితంగా పెంచుతుంది. ఆయనకు నా ఆలోచన, ప్రేక్షకుల పల్స్‌ బాగా అర్ధమయ్యాయి.

– సినిమా ఆలస్యమైన మాట వాస్తవమే. ఎందుకంటే ప్రపంచం మొత్తం కోవిడ్‌ వల్ల ఇబ్బంది పడింది. ఆలస్యం అవుతోంది అన్న చిన్న టెన్షన్‌ తప్ప.. నా మీద ఇంకే విధమైన ప్రెషర్‌ లేదు. ఎందుకంటే నేను ఏమి తీయాలనుకున్నాను అనే దానిమీద ఫుల్‌ క్లారిటీగా ఉన్నాను. అదే తీశాను. నా నిర్మాతలు కూడా అదే లైన్‌ మీద ఉండటం వల్ల నేను టెన్షన్‌ ఫ్రీ.

– మార్చి 1, 2 తేదీల నుంచి ప్రమోషన్‌ స్టార్ట్‌ అవుతుంది. బొంబాయిలో, చెన్నైలో రెండు భారీ ప్రమోషన్‌ ఈవెంట్‌లు ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News