మరో వివాదంలో సీనియర్ నటుడు నరేష్
నరేష్ కు వివాదాలు కొత్త కాదు. ఆమధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అదంతా సద్దుమణిగిందనుకున్న టైమ్ లో ఇప్పుడీ సీనియర్ హీరో మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈసారి ఇది అతడి వ్యక్తిగత వివాదం. రమ్య రఘుపతి అనే మహిళ, ఓ కంపెనీని స్థాపించి దానిపై పలువురి వద్ద అప్పులు చేసింది. కొంతమందికి తిరిగి డబ్బులు చెల్లించలేదు. అడిగిన వాళ్లకు నరేష్ పేరు చెప్పిందట. నరేష్ నుంచి తనకు అధిక మొత్తంలో […]
నరేష్ కు వివాదాలు కొత్త కాదు. ఆమధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అదంతా సద్దుమణిగిందనుకున్న టైమ్ లో ఇప్పుడీ సీనియర్ హీరో మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈసారి ఇది అతడి వ్యక్తిగత వివాదం.
రమ్య రఘుపతి అనే మహిళ, ఓ కంపెనీని స్థాపించి దానిపై పలువురి వద్ద అప్పులు చేసింది. కొంతమందికి తిరిగి డబ్బులు చెల్లించలేదు. అడిగిన వాళ్లకు నరేష్ పేరు చెప్పిందట. నరేష్ నుంచి తనకు అధిక మొత్తంలో డబ్బు వస్తుందని, అప్పుడు తిరిగి చెల్లిస్తానంటూ వాదించిందట. దీంతో సదరు రమ్య రఘుపతిపై పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి.
ఇంతకీ ఈ రమ్య రఘువతి ఎవరో కాదు, స్వయంగా నరేష్ భార్య. కాకపోతే ఇప్పుడు కాదు, ఒకప్పుడు. అవును.. దాదాపు 9 ఏళ్ల కిందట వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు కాపురం కూడా చేశారు. వాళ్లకు ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. రమ్యతో ఆరేళ్ల కిందట విడాకులు కూడా తీసుకున్నాడు నరేష్.
ఇప్పుడు అనుకోకుండా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నరేష్ పేరు తెరపైకొచ్చింది. దీంతో ఆయన ఈ వివాదంపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రమ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశాడు నరేష్. తన కుటుంబ సభ్యులకు కూడా ఆమెతో ఎలాంటి సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చాడు. రమ్యతో, ఆమె ఆర్థిక వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ 3 నెలల కిందట పబ్లిక్ నోటీసు కూడా ఇచ్చిన విషయాన్ని నరేష్ గుర్తుచేశాడు.
ఇకపై రమ్య ఆర్థిక వ్యవహారాల కేసులో తన పేరును ప్రస్తావించొద్దని అందర్నీ కోరుతున్నాడు. ఇక డబ్బులు పోగొట్టుకున్న కొంతమంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ఆ విషయంలో తనకు తోచిన మద్దతు అందిస్తానని ప్రకటించాడు ఈ సీనియర్ నటుడు.