డాక్టర్లకు వేసేదే ఎర.. దానిపై ఐటీ మినహాయింపు కావాలా..?

మెడికల్, ఫార్మా కంపెనీలు.. డాక్టర్లకు ఉచితంగా కొన్ని మందుల్ని ఇస్తుంటాయి. అంతే కాదు, కాస్ట్ లీ గిఫ్ట్ లు, విదేశీ ప్రయాణాలు, స్వదేశీ పార్టీలు.. ఇలా రకరకాల ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. బదులుగా వారి దగ్గరనుంచి వ్యాపారం కోరుకుంటాయి. ఫలానా కంపెనీ మందులే వాడండి అంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై రాసేలా ఎర వేస్తుంటాయి. ఇదంతా బహిరంగ రహస్యమే. అయితే ఈ వ్యవహారంలో డాక్టర్ల కోసం ఖర్చు పెట్టే సొమ్ముకి ఆయా కంపెనీలు ఆదాయపు పన్ను మినహాయింపు కోరడమే […]

Advertisement
Update:2022-02-23 02:28 IST

మెడికల్, ఫార్మా కంపెనీలు.. డాక్టర్లకు ఉచితంగా కొన్ని మందుల్ని ఇస్తుంటాయి. అంతే కాదు, కాస్ట్ లీ గిఫ్ట్ లు, విదేశీ ప్రయాణాలు, స్వదేశీ పార్టీలు.. ఇలా రకరకాల ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. బదులుగా వారి దగ్గరనుంచి వ్యాపారం కోరుకుంటాయి. ఫలానా కంపెనీ మందులే వాడండి అంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై రాసేలా ఎర వేస్తుంటాయి. ఇదంతా బహిరంగ రహస్యమే. అయితే ఈ వ్యవహారంలో డాక్టర్ల కోసం ఖర్చు పెట్టే సొమ్ముకి ఆయా కంపెనీలు ఆదాయపు పన్ను మినహాయింపు కోరడమే విచిత్రం. దీనికోసం ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించింది అపెక్స్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. కానీ అక్కడ ఎదురుదెబ్బ తిన్నది. సదరు కంపెనీ పిటిషన్ ని తోసిపుచ్చిన సుప్రీం చీవాట్లు పెట్టింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లను మార్చేలా వారికి బంగారు నాణేలు, ఫ్రిడ్జ్ లు, టీవీలు.. ఇచ్చే సంప్రదాయం అత్యంత ఆందోళనకర అంశం అని పేర్కొంది.

రోగుల నమ్మకంతో వ్యాపారమా..?
వైద్యులపై రోగులు అత్యంత నమ్మకం పెట్టుకుంటారని, వారి సూచనల ప్రకారమే మందులు వాడుతుంటారని, అలాంటప్పుడు వారి ప్రిస్క్రిప్షన్ ని ప్రభావితం చేసేలా వైద్యులకు, ఫార్మా కంపెనీలు గిఫ్ట్ లు ఇవ్వడం సరికాదని తెలిపింది. ఇలా డాక్టర్లకు ఉచిత బహుమతులు, ఉచితంగా వారికి విహార యాత్రలు ఏర్పాటు చేస్తే.. చివరిగా ఆ భారం రోగులపైనే పడుతుందని స్పష్టం చేసింది. ఇలాంటి ఉచితాలు వద్దని చెబుతూనే.. ఆదాయపు పన్ను మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసింది సుప్రీంకోర్టు.

ఉచితాల ప్రవాహం ఆగుతుందా..?
సుప్రీంకోర్టు సూచన మేరకు, డాక్టర్లకు ఫార్మా కంపెనీలు వేసే ఉచితాల ఎర ఆగుతుందా అనేది అనుమానమే. ఈ రూపంలో కాకపోతే, మరో రూపంలో అన్నట్టుగా ఈ క్విడ్ ప్రోకో సాగుతుంది. వైద్యులకు ఫార్మా కంపెనీలనుంచి గిఫ్ట్ లు గిట్టుబాటు అయితే, ఫార్మా కంపెనీలకు డాక్టర్ల నుంచి వ్యాపారం పెరుగుతుంది. మధ్యలో మందుల రేట్లు పెరిగి రోగి ఆర్థికంగా నష్టపోవడం మాత్రం ఖాయం. జనరిక్ మెడిసిన్ అనే మధ్యేమార్గం ఉన్నా కూడా అది ఇంకా పూర్తి స్థాయిలో జనాల్లోకి రాలేదు.

Tags:    
Advertisement

Similar News