బాలయ్య సినిమా టైటిల్ ఇదేనా?
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడీ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో 2-3 టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు జై బాలయ్య, పెద్దాయన, వేట లాంటి టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఏ టైటిల్ పెట్టినా, పెట్టకపోయినా […]
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడీ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో 2-3 టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి.
బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు జై బాలయ్య, పెద్దాయన, వేట లాంటి టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఏ టైటిల్ పెట్టినా, పెట్టకపోయినా వేట అనే టైటిల్ మాత్రం పెట్టరు. ఎందుకంటే, గతంలో ఇదే టైటిల్ తో చిరంజీవి సినిమా చేశారు. కాబట్టి బాలయ్య ఆ టైటిల్ ను రిపీట్ చేయరు.
ఆశ్చర్యకరంగా ఈసారి సింహా అనే పేరును తగిలిస్తూ ఎలాంటి టైటిల్స్ ప్రచారంలో లేకపోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. అఖండ, లెజెండ్ లాంటి టైటిల్స్ చూసిన తర్వాత మేకర్స్ కూడా సింహా అనే ట్యాగ్ ను వదిలిపెట్టినట్టే ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ నడుస్తోంది.
మొన్నటివరకు ఈ సినిమా రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ ఆ విషయాన్ని ఖండించారు. ఒరిజినల్ కథతో తమ సినిమా తెరకెక్కుతోందని స్పష్టంచేశారు. మరోవైపు బాలయ్య ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.