గాంధారిగా మెరిసిన కీర్తిసురేష్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ నటించిన మొట్టమొదటి తెలుగు పాప్ సాంగ్ ‘గాంధారి’. సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్మెంట్, ది రూట్ అసోషియేషన్‌లో ఈ సాంగ్ రూపొందింది. తాజాగా గాంధారి మ్యూజికల్ వీడియోను విడుదల చేశారు. కీర్తి సురేష్ అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ తో ఈ వీడియో తెరకెక్కింది. డైరెక్టర్, కొరియో గ్రాఫర్ బృంద మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సి.హెచ్, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, సింగర్ అనన్య భట్ ‘గాంధారి’మ్యూజికల్ వీడియో […]
నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ నటించిన మొట్టమొదటి తెలుగు పాప్ సాంగ్ ‘గాంధారి’. సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్మెంట్, ది రూట్ అసోషియేషన్‌లో ఈ సాంగ్ రూపొందింది. తాజాగా గాంధారి మ్యూజికల్ వీడియోను విడుదల చేశారు. కీర్తి సురేష్ అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ తో ఈ వీడియో తెరకెక్కింది. డైరెక్టర్, కొరియో గ్రాఫర్ బృంద మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సి.హెచ్, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, సింగర్ అనన్య భట్ ‘గాంధారి’మ్యూజికల్ వీడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘గాంధారి’ పోస్టర్‌ను కీర్తి సురేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కీర్తిసురేష్.. గాంధారి తనకొక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అని చెబుతోంది.
“గాంధారి’ లాంటి మ్యూజికల్ వీడియోలో యాక్ట్ చేయడం ఇదే తొలిసారి. నాకు కూడా ఓ ఎక్స్‌పెరిమెంట్‌గా అనిపించింది. రూట్, సోనీ మ్యూజిక్‌కి థాంక్స్. సారంగ దరియా తర్వాత గాంధారితో వపన్ మరో హిట్ అందుకున్నారు. సుద్దాలగారు అద్భుతంగా పాట రాశారు. బృందగారితో, నేను ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న్పపుడు వర్క్ చేశాను. అలాగే ఆమె కొరియోగ్రఫీలో వర్క్ చేశాను. అలాగే ఆమె డైరెక్షన్‌లోనూ పనిచేయడం కొత్త అనుభూతినిచ్చింది. 2 రోజుల్లో ఈ సాంగ్ షూట్ చేశాం. ఈ ఆల్బమ్‌లో భాగమైన టెక్నికల్ టీమ్ ఎంతో కష్టపడ్డారు. అందరికీ థాంక్స్’’
ఇలా గాంధారీ సాంగ్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకుంది కీర్తిసురేష్. హీరోయిన్లు ఇలా ఓ మ్యూజిక్ వీడియో చేయడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. నార్త్ లో ఇప్పటికే చాలా పాపులర్ అయిన ఈ కాన్సెప్ట్ ను ఇప్పుడు సోనీ మ్యూజిక్ కంపెనీ తెలుగుకు పరిచయం చేస్తోంది. ముందుగా కీర్తిసురేష్ తో గాంధారి వీడియో చేసింది. త్వరలోనే మరింతమంది స్టార్స్ తో మరిన్ని మ్యూజిక్ వీడియోలు చేయబోతోంది ఈ సంస్థ.