రేపే భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్
భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రేపు గ్రాండ్ గా జరగబోతోంది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే అంచనాల మధ్య గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. రేపటి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాడు. ప్రత్యేక అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ వాయిదా పడింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ హఠాన్మరణంతో, ఆయన మృతికి సంతాప సూచకంగా […]
భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రేపు గ్రాండ్ గా జరగబోతోంది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే అంచనాల మధ్య గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. రేపటి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాడు. ప్రత్యేక అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు.
భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ వాయిదా పడింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ హఠాన్మరణంతో, ఆయన మృతికి సంతాప సూచకంగా భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను వాయిదా వేశారు. అలా పోస్ట్ పోన్ అయిన ఈ వేడుకను రేపు భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అభిమానులకు పాసులు అందించారు.
ప్రీ-రిలీజ్ తో పాటు ట్రయిలర్ ను విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. అయితే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడ్డంతో.. ట్రయిలర్ ను మాత్రం అనుకున్న టైమ్ కే విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రయిలర్ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పవన్-రానా లుక్స్, డైలాగ్స్ కు మంచి క్రేజ్ వచ్చింది.
సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది భీమ్లానాయక్ సినిమా. త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు-స్క్రీన్ ప్లే అందించాడు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. పవన్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటించింది.