ప్రభాస్ సినిమాకు బిగ్ బి వాయిస్ ఓవర్
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్, కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌లో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు నెరేటర్‌గా మారిపోయారు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్. రాధేశ్యామ్ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. […]
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్, కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌లో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు నెరేటర్‌గా మారిపోయారు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్. రాధేశ్యామ్ సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాకు అమితాబ్ బచ్చన్ గారి నెరేషన్ అదనపు ఆకర్షణ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. మీరు ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు మరింత ప్రత్యేకంగా మారుతుందంటూ బిగ్ బి గారికి థ్యాంక్స్ చెప్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఊపులో సినిమాకు సంబంధించి మరో టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటోంది యూనిట్. దీనికి సంబంధించి రేపోమాపో అధికారిక ప్రకటన రాబోతోంది.
మార్చి 11న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది రాధేశ్యామ్ సినిమా. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది.