పంజాబ్ లో పోలింగ్.. సోనూ సూద్ హౌస్ అరెస్ట్.. 

సింగిల్ ఫేజ్ లో పూర్తి కావాల్సిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగానే మొదలయ్యాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, ఎలాగైనా పంజాబ్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కెప్టెన్ అమరీందర్ ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని బీజేపీ.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు సోనూ సూద్ సోదరి మాల్వికా సూద్ కూడా పోటీ చేస్తున్నారు. మోగా నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. […]

Advertisement
Update:2022-02-20 19:35 IST
సింగిల్ ఫేజ్ లో పూర్తి కావాల్సిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగానే మొదలయ్యాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, ఎలాగైనా పంజాబ్ లో పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కెప్టెన్ అమరీందర్ ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని బీజేపీ.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు సోనూ సూద్ సోదరి మాల్వికా సూద్ కూడా పోటీ చేస్తున్నారు. మోగా నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వాస్తవానికి సోనూ సూద్ పంజాబ్ లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని ఆ పార్టీ నాయకులు ఆశపడ్డా.. ఆయన కేవలం సోదరి నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. తీరా ఇప్పుడు పోలింగ్ వేళ ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు, ఆయన కారు సీజ్ చేశారు.
పోలింగ్ రోజున మోగా నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్ లకు వెళ్లేందుకు ప్రయత్నించారు సోనూ సూద్. అయితే సోనూ పోలింగ్ బూత్ లోకి వెళ్లకండా స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్ మద్దతుదారులు చేసిన ఫిర్యాదుతో సోనూని అడ్డుకున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లి ఓటర్లను ఆయన ప్రభావితం చేస్తున్నారని విమర్శలు రావడంతో పోలీసులు సోనూ సూద్ కారు సీజ్ చేశారు. సోనూని ఇంటికి తరలించి బయటకు రావద్దని సూచించారు.
తాను స్థానికుడిని కాబట్టే పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లానని, అయితే పోలింగ్ బూత్ లోకి వెళ్లడానికి తాను ప్రయత్నించలేదని, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ శిబిరం వద్దకు మాత్రమే వెళ్లానని చెబుతున్నారు సోనూ సూద్. ఇతర అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు.
సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశాలు..
సోనూ సూద్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్లారా..? ఓటర్లను ప్రభావితం చేశారా.. అనే అంశంపై నివేదిక సమర్పించాలని మోగా పోలీస్ అధికారుల్ని జిల్లా కలెక్టర్ హరీశ్ నయ్యర్ ఆదేశించారు. సోనూ సూద్ ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరొక పోలింగ్ స్టేషన్‌ కు వెళ్తున్నారని.. కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆయన్ను ఇంటికి పంపించేశారని వివరణ ఇచ్చారు.
Advertisement

Similar News