త్రిష బ్యాచిలర్స్ పార్టీ ఇచ్చిందా?

త్రిష పెళ్లిపై ఇప్పుడు కాదు, దాదాపు దశాబ్దం నుంచి పుకార్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు త్రిష పెళ్లి చేసుకోలేదు. అయితే ఈసారి ఆమె పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. దుబాయ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను త్రిష పెళ్లాడబోతున్నట్టు పుకార్లు వస్తున్నాయి. వీటికి మరింత ఊతమిస్తూ, తాజాగా ఓ పార్టీ ఇచ్చింది త్రిష. దీన్ని బ్యాచిలర్స్ పార్టీ అంటోంది సోషల్ మీడియా. రీసెంట్ గా తను పార్టీ ఇచ్చినట్టు ప్రకటించుకుంది త్రిష. దానికి సంబంధించి కొన్ని […]

Advertisement
Update:2022-02-20 15:40 IST

త్రిష పెళ్లిపై ఇప్పుడు కాదు, దాదాపు దశాబ్దం నుంచి పుకార్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు త్రిష పెళ్లి చేసుకోలేదు. అయితే ఈసారి ఆమె పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. దుబాయ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను త్రిష పెళ్లాడబోతున్నట్టు పుకార్లు వస్తున్నాయి. వీటికి మరింత ఊతమిస్తూ, తాజాగా ఓ పార్టీ ఇచ్చింది త్రిష. దీన్ని బ్యాచిలర్స్ పార్టీ అంటోంది సోషల్ మీడియా.

రీసెంట్ గా తను పార్టీ ఇచ్చినట్టు ప్రకటించుకుంది త్రిష. దానికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా షేర్ చేసింది. అందులో రమ్యకృష్ణ, రాధిక, ఖుష్బూ, గౌతమ్ మీనన్, బోనీకపూర్.. ఇలా చాలామంది ప్రముఖులున్నారు. వీళ్లందరికీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది త్రిష. ఇది పెళ్లికి ముందు ఇచ్చే బ్యాచిలర్స్ పార్టీనే అంటున్నారు చాలామంది. త్రిష మాత్రం సింపుల్ గా “మై ట్రైబ్” అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి వదిలేసింది.

ఈమె పెళ్లి పుకార్లు ఎక్కువగా వినిపించడానికి మరో కారణం కూడా ఉంది. త్రిష ఇప్పుడు సినిమాలు తగ్గించింది. అవకాశాలు రాక ఆమెకు సినిమాలు తగ్గలేదు. వస్తున్న ఆఫర్లను కూడా రిజెక్ట్ చేస్తోంది. చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసింది. పెళ్లి చేసుకోవడం కోసమే త్రిష ఇదంతా చేస్తోందనే కథనాలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని మరింత బలపరిచేలా పార్టీ ఇచ్చింది త్రిష.

Tags:    
Advertisement

Similar News