సమంత కోసం రూ. 3 కోట్లు భారీ సెట్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరక్టర్ అశోక్ నేతృత్వంలో 3 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్స్ వేశారు. ప్రస్తుతం ఆ సెట్స్‌లో కథలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో 30-40 శాతం […]

Advertisement
Update:2022-02-20 15:30 IST

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరక్టర్ అశోక్ నేతృత్వంలో 3 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్స్ వేశారు. ప్రస్తుతం ఆ సెట్స్‌లో కథలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

సినిమాలో 30-40 శాతం సన్నివేశాలు ఒకే ప్రాంతంలో జరుగుతాయి. అందుకోసం హైదరాబాద్‌లో చాలా స్టార్ హోటల్స్ చూశారు. అయితే… 35-40 రోజులు హోటల్స్‌లో షూట్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఏకంగా స్టార్ హోటల్ సెట్ వేశారు. నాన‌క్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ తీసుకుని వేసిన ఈ సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది.

డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ… సెవెన్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. ఫిబ్రవరి 3 నుంచి ఈ సెట్స్ లోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు.

క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ ను కొడైకెనాల్‌లో ప్లాన్ చేశారు. ఏప్రిల్ నెలాఖరుకు టోటల్ షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలకాబోతోంది యశోద.

Tags:    
Advertisement

Similar News