బన్నీ మిస్సయ్యాడు.. రామ్ దొరికాడు

అఖండ సక్సెస్ అయిన వెంటనే దర్శకుడు బోయపాటి శ్రీను ట్రై చేసిన హీరోల్లో ఒకడు అల్లు అర్జున్. బన్నీ ఓకే అంటే, ఏడాదైనా గ్యాప్ తీసుకోవడానికి బోయపాటి రెడీ. కానీ బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఫలితంగా రామ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు ఈ దర్శకుడు. బోయపాటి-రామ్ కాంబోలో సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ కాంబోలో ఇదే తొలి సినిమా. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమాను శ్రీనివాసా […]

Advertisement
Update:2022-02-19 13:40 IST

అఖండ సక్సెస్ అయిన వెంటనే దర్శకుడు బోయపాటి శ్రీను ట్రై చేసిన హీరోల్లో ఒకడు అల్లు అర్జున్. బన్నీ ఓకే అంటే, ఏడాదైనా గ్యాప్ తీసుకోవడానికి బోయపాటి రెడీ. కానీ బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఫలితంగా రామ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు ఈ దర్శకుడు. బోయపాటి-రామ్ కాంబోలో సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ కాంబోలో ఇదే తొలి సినిమా.

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం… ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీనిని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి పవన్ కుమార్ సమర్పకుడు.

ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. అదీ మా హీరో రామ్ తో ‘ది వారియర్’ తర్వాత సినిమాగా కుదరడం కూడా హ్యాపీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం. మా బ్యాన‌ర్‌కు ఇది ప్రెస్టీజియస్ మూవీ. ప్రస్తుతం రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. బోయపాటి – రామ్ సినిమా కూడా భారీ స్థాయిలో, ఉన్నత నిర్మాణ విలువలతో తీస్తాం” అని అన్నారు.

Tags:    
Advertisement

Similar News