భీమ్లానాయక్ సెన్సార్ టాక్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక్క మ్యూట్ మాత్రం పడింది. సినిమా రన్ టైమ్ కూడా పెర్ ఫెక్ట్ గా కట్ చేశారు. నిడివి 2 గంటల 21 నిమిషాలుంది. సెన్సార్ టాక్ ప్రకారం.. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయంట. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు బాగున్నాయని చెబుతున్నారు. త్రివిక్రమ్ […]
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా చెప్పకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక్క మ్యూట్ మాత్రం పడింది. సినిమా రన్ టైమ్ కూడా పెర్ ఫెక్ట్ గా కట్ చేశారు. నిడివి 2 గంటల 21 నిమిషాలుంది.
సెన్సార్ టాక్ ప్రకారం.. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయంట. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు బాగున్నాయని చెబుతున్నారు. త్రివిక్రమ్ మరోసారి తన మాటలకు పదునుపెట్టగా.. ఈ రీమేక్ సబ్జెక్ట్ ను సెకండాఫ్ లో పూర్తిగా మార్చినట్టు చెబుతున్నారు కొంతమంది.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు సినిమాకు సంబంధించి ఈనెల 21న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకకు మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్. ప్రీ-రిలీజ్ ఈవెంట్ రోజునే ట్రయిలర్ కూడా విడుదల చేయబోతున్నారు.
పవన్ కల్యాణ్, రానా నటించిన ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే సమకూర్చగా.. తమన్ సంగీతం అందించాడు. పవన్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నాడు భీమ్లానాయక్.