తెలంగాణలో హిట్.. ఏపీలో యావరేజ్
బంగార్రాజు ఏపీలో పెద్ద హిట్టయింది. అందులో ఎమోషన్స్, ఆ నేటివిటీకి ఏపీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు డీజే టిల్లు విషయంలో అది పూర్తిగా రివర్స్ అయింది. ఈ సినిమా తెలంగాణలో పెద్ద హిట్టయింది. ఏపీలో మాత్రం అంతగా కనెక్ట్ అవ్వలేదు. వసూళ్లు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. పూర్తిగా తెలంగాణ నేటివిటీ, తెలంగాణ యాసతో తెరకెక్కింది డీజే టిల్లు సినిమా. ఇందులో హీరో తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. దీంతో ఈ మూవీ ఏపీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయలేకపోయింది. […]
బంగార్రాజు ఏపీలో పెద్ద హిట్టయింది. అందులో ఎమోషన్స్, ఆ నేటివిటీకి ఏపీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు డీజే టిల్లు విషయంలో అది పూర్తిగా రివర్స్ అయింది. ఈ సినిమా తెలంగాణలో పెద్ద హిట్టయింది. ఏపీలో మాత్రం అంతగా కనెక్ట్ అవ్వలేదు. వసూళ్లు అంతంతమాత్రంగానే వస్తున్నాయి.
పూర్తిగా తెలంగాణ నేటివిటీ, తెలంగాణ యాసతో తెరకెక్కింది డీజే టిల్లు సినిమా. ఇందులో హీరో తెలంగాణ యాసలోనే మాట్లాడతాడు. దీంతో ఈ మూవీ ఏపీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయలేకపోయింది. ఓవైపు ఆంధ్రప్రదేశ్ లో సినిమా యూనిట్ జోరుగా ప్రచారం చేస్తున్నప్పటికీ, సక్సెస్ టూర్లు చేస్తున్నప్పటికీ రెస్పాన్స్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.
తెలంగాణ విషయానికొస్తే టిల్లు పెద్ద హిట్టయింది. ఇంకా చెప్పాలంటే విడుదలైన మొదటి రోజే సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. రెండో రోజు నుంచే ఈ సినిమాకు లాభాలు రావడం మొదలయ్యాయి. అలా ఫస్ట్ వీకెండ్ లో భారీ లాభాలు చూసిన ఈ సినిమా, సెకండ్ వీకెండ్ లో కూడా మంచి వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా డీజే టిల్లూ, లాజిక్కులకు దూరంగా పూర్తి వినోదాత్మకంగా సాగిన ఈ సినిమాలో ఫస్టాఫ్ అందర్నీ ఆకట్టుకుంది. సెకండాఫ్ మాత్రం కొంతమందికి నచ్చలేదు. ఓవరాల్ గా కామెడీ పండించడంలో డీజే టిల్లు పూర్తిగా సక్సెస్ అయింది.