అది వెంకటేష్ చేయాల్సిన సినిమా కాదంట

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించి చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమా కథను ముందుగా వెంకటేష్ కు చెప్పాడని, అతడు నిరాకరించడంతో శర్వానంద్ హీరోగా సినిమాను తెరకెక్కించాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఈ ప్రచారంపై కిషోర్ తిరుమల స్పందించాడు. “ఆ ప్రచారం నిజం కాదు. విక్టరీ వెంకటేష్‌గారికి నేను చెప్పిన స్క్రిప్ట్‌ ఇది కాదు, వేరే టైటిల్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకున్నాను. హీరో పాత్ర కాస్త ఒకేలా ఉన్నప్పటికీ కథ మాత్రం […]

Advertisement
Update:2022-02-17 00:57 IST

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించి చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమా కథను ముందుగా వెంకటేష్ కు చెప్పాడని, అతడు నిరాకరించడంతో శర్వానంద్ హీరోగా సినిమాను తెరకెక్కించాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. ఈ ప్రచారంపై కిషోర్ తిరుమల స్పందించాడు.

“ఆ ప్రచారం నిజం కాదు. విక్టరీ వెంకటేష్‌గారికి నేను చెప్పిన స్క్రిప్ట్‌ ఇది కాదు, వేరే టైటిల్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకున్నాను. హీరో పాత్ర కాస్త ఒకేలా ఉన్నప్పటికీ కథ మాత్రం భిన్నంగా ఉంటుంది. బ్యాక్‌డ్రాప్‌ అదే కానీ కథను మార్చాం.”

ఇలా వెంకీ ప్రాజెక్టు కాదంటూనే.. హీరో క్యారెక్టరైజేషన్, బ్యాక్ డ్రాప్ దాదాపు ఒకేలా ఉంటుందనే విషయాన్ని బయటపెట్టాడు కిషోర్ తిరుమల. కాబట్టి ఇక వెంకీతో ఆ పాత కథతో ఈ దర్శకుడు సినిమా చేయలేడు.

ఇక శర్వానంద్ విషయానికొస్తే.. ఈ జానర్ లో శర్వా ఒక్క సినిమా కూడా చేయలేదని, అందుకే శర్వా, తను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామనంటున్నాడు దర్శకుడు. సినిమాలో మహిళా పాత్రలు ఎక్కువగా ఉంటాయని, పైగా అన్నీ కీలకమైన పాత్రలే కాబట్టి.. ఖుష్బూ, రాధిక లాంటి సీనియర్ ఆర్టిస్టుల్ని తీసుకున్నామని చెబుతున్నాడు కిషోర్ తిరుమల.

Tags:    
Advertisement

Similar News