నానికి అసలైన దసరా మొదలైంది
నేచురల్ స్టార్ నాని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు, అతను వైవిధ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు. మునుపెన్నడూ చూడని పాత్రలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శ్యామ్ సింఘ రాయ్ విజయంతో ఊపుమీదున్న నాని ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా చిత్రం చేస్తున్నాడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. దసరా చిత్రం ఈరోజు (బుధవారం నాడు) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిధులుగా […]
నేచురల్ స్టార్ నాని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు, అతను వైవిధ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు. మునుపెన్నడూ చూడని పాత్రలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శ్యామ్ సింఘ రాయ్ విజయంతో ఊపుమీదున్న నాని ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా చిత్రం చేస్తున్నాడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్.
దసరా చిత్రం ఈరోజు (బుధవారం నాడు) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిధులుగా సుకుమార్, తిరుమల కిషోర్, వేణు ఉడుగుల, శరత్ మండవ హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు శ్రీకాంత్ తండ్రి చంద్రయ్య కెమెరా స్విచాన్ చేయగా, నాని-కీర్తి సురేష్ క్లాప్ కొట్టారు. తిరుమల కిషోర్, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెల చిత్ర స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు.
గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ఒక గ్రామంలో జరిగే కథ ఇది. నాని ఇందులో మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలా అని ఇది పూర్తిస్థాయిలో యాక్షన్ మూవీ కాదు. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. సముత్తర ఖని, సాయికుమార్, జరీనా వహాబ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నాయాణన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి ప్రారంభమవుతుంది.