సర్కారువారి పాట షూటింగ్ అప్ డేట్స్
మహేష్ బాబు , పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కారువారి పాట’ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఇందుకోసం ఫ్లోర్ లో భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోనే భారీ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. వందల మంది ఫైట్ అసిస్టెంట్లతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇది. ఇదే యాక్షన్ సన్నివేశంలో మహేష్ తో పాటు మరికొందరు నటీనటులు కూడా పాల్గొంటున్నారు. […]
మహేష్ బాబు , పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కారువారి పాట’ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఇందుకోసం ఫ్లోర్ లో భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోనే భారీ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. వందల మంది ఫైట్ అసిస్టెంట్లతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇది.
ఇదే యాక్షన్ సన్నివేశంలో మహేష్ తో పాటు మరికొందరు నటీనటులు కూడా పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవ్వనుందని తెలుస్తుంది. మొదటి షెడ్యుల్ లో దుబాయ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ ఎపిసోడ్ కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని మేకర్స్ అంటున్నారు. ఈ షెడ్యుల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
తాజాగా ఈ సినిమా ప్రచారం ప్రారంభించారు. కళావతి అనే సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా విడుదల చేశారు. తక్కువ టైమ్ లోనే ఎక్కువ వ్యూస్ పొందిన తెలుగు లిరికల్ వీడియోగా ఇది గుర్తింపు పొందింది. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ కూడా త్వరలోనే రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ వరకూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసి మే 12న రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారు.