హీరోయిన్ రీఎంట్రీ.. ఈసారి బాలయ్య కోసం

మీరా జాస్మిన్ గుర్తుందా.. గతంలో ఒకట్రెండు సినిమాలతో టాలీవుడ్ లో మెరిసిన ఈ మలయాళీ భామ పేరు ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. దీనికి కారణం బాలయ్య సినిమా. అవును.. బాలకృష్ణ కోసం మీరా జాస్మిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరా జాస్మిన్ మేకోవర్ అయింది. ఈమధ్య కాస్త గ్యాప్ తీసుకొని ఫిజిక్ […]

Advertisement
Update:2022-02-15 16:36 IST

మీరా జాస్మిన్ గుర్తుందా.. గతంలో ఒకట్రెండు సినిమాలతో టాలీవుడ్ లో మెరిసిన ఈ మలయాళీ భామ పేరు ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. దీనికి కారణం బాలయ్య సినిమా. అవును.. బాలకృష్ణ కోసం మీరా జాస్మిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి

మీరా జాస్మిన్ మేకోవర్ అయింది. ఈమధ్య కాస్త గ్యాప్ తీసుకొని ఫిజిక్ తగ్గించుకుంది. అలా వయసు పెరిగినా తనలో అందాలు తగ్గలేదని తాజా ఫొటోలతో చాటిచెప్పింది. ఆ మేకోవరే ఈమెకు బాలయ్య సినిమాలో హీరోయిన్ ఛాన్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేయాలనుకుంటోంది ఈ మల్లూ బ్యూటీ.

అన్నట్టు ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీలీలను కూడా తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఆమె బాలయ్య సరసన హీరోయిన్ కాదు. సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించబోతోందట. దీని కోసం ఆమె భారీగానే ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News