భీమ్లా నాయక్, గని కలిసి వస్తున్నారు

ఒకే కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, పవన్ కల్యాణ్ సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ రెండు సినిమాల్లో ఒకటి కచ్చితంగా వాయిదా పడుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అలాంటిదేం జరగలేదు. రెండు సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి. ఈ రోజు ఈ రెండు సినిమాల నుంచి అప్ డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా, వరుణ్ తేజ్ నటించిన గని సినిమాలు రెండూ ఫిబ్రవరి 25కే వస్తున్నాయి. […]

Advertisement
Update:2022-02-15 16:49 IST

ఒకే కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, పవన్ కల్యాణ్ సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ రెండు సినిమాల్లో ఒకటి కచ్చితంగా వాయిదా పడుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అలాంటిదేం జరగలేదు. రెండు సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి. ఈ రోజు ఈ రెండు సినిమాల నుంచి అప్ డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా, వరుణ్ తేజ్ నటించిన గని సినిమాలు రెండూ ఫిబ్రవరి 25కే వస్తున్నాయి. దీంతో ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతయింది.

వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న సినిమా గని. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. అన్నీ లెక్కలు వేసుకొని ఫిబ్రవరి 25 డేట్ ప్రకటించారు. ఇప్పుడు భీమ్లానాయక్ కూడా అదే తేదీకంటూ మేకర్స్ ప్రకటించారు. దీంతో గని సినిమా మరోసారి డైలమాలో పడింది. 25కే వస్తుందా లేక వాయిదా పడుతుందా అనేది చూడాలి.

గని సినిమాతో పాటు ఫిబ్రవరి 25కి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షెడ్యూల్ అయింది. శర్వానంద్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై కూడా ఇప్పుడు భీమ్లానాయక్ ఎఫెక్ట్ పడింది. భీమ్లానాయక్ 25న రావడం పక్కా అని తేలడంతో.. శర్వానంద్ సినిమా దాదాపు వాయిదా పడినట్టే.

ప్రస్తుతానికైతే ఈ 3 సినిమాలు 25కే షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటిలో గని, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో ఏది పోస్ట్ పోన్ అవుతుంది, లేక రెండూ పోస్ట్ పోన్ అవుతాయా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News