రికార్డ్ సృష్టించిన కళావతి

మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ మే 12 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లిరికల్ వీడియో విడుదల చేశారు. కళావతి అనే లిరిక్స్ తో వచ్చిన ఈ సాంగ్ నిన్న విడుద‌లై ట్రెమండ‌స్ రెస్పాన్స్ ద‌క్కించుకుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్, […]

Advertisement
Update:2022-02-14 17:04 IST

మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ మే 12 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రానికి త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. తాజాగా ఫస్ట్ లిరికల్ వీడియో విడుదల చేశారు.

కళావతి అనే లిరిక్స్ తో వచ్చిన ఈ సాంగ్ నిన్న విడుద‌లై ట్రెమండ‌స్ రెస్పాన్స్ ద‌క్కించుకుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్, సింగ‌ర్ సిద్ శ్రీరామ్, లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ కలయికతో ఈ పాట రికార్డు వ్యూస్ సాధించి మెలొడి సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచింది. క‌ళావ‌తి పాట 24 గంట‌ల్లో 16 మిలియ‌న్ల వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన పాట‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక 24 గంట‌ల్లో ఈ పాటకు 806K లైక్స్ రావ‌డం విశేషం.

ఈ మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి వరుసపెట్టి లిరికల్ వీడియోస్ రాబోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News