రాధేశ్యామ్ వాలంటైన్ వీడియో అదిరింది
ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా నుంచి ఈరోజు మరో వీడియో వచ్చింది. ప్రేమికుల రోజు సందర్భంగా వాలంటైన్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాన్స్ చాలా బాగుంది. మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు రిలీజ్ చేసిన గ్లింప్స్ లో హైలెట్ […]
ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా నుంచి ఈరోజు మరో వీడియో వచ్చింది. ప్రేమికుల రోజు సందర్భంగా వాలంటైన్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాన్స్ చాలా బాగుంది. మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈరోజు రిలీజ్ చేసిన గ్లింప్స్ లో హైలెట్ పాయింట్ ఏంటంటే.. ప్రభాస్ పెళ్లి. అవును.. వీడియోలో ప్రభాస్ కు ఎందుకు ఇంకా పెళ్లి అవ్వలేదని హీరోయిన్ ప్రశ్నిస్తుంది. దానికి ప్రభాస్ నీళ్లు నములుతాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయిపోయింది. ప్రభాస్ కు నిజ జీవితంలో ఇంకా పెళ్లికాని విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని సినిమాలో కూడా పెట్టారనే విషయం వీడియో చూస్తే అర్థమౌతోంది.
ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి.
ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు మరోసారి అధికారికంగా ప్రచారం స్టార్ట్ చేసినట్టు ప్రకటించారు మేకర్స్. ఇకపై దశలవారీగా సినిమాకు సంబంధించి భారీగా ప్రచారం చేసి, మార్చి 11న థియేటర్లలోకి వస్తామంటున్నారు.