భీమ్లానాయక్ షూటింగ్ అప్ డేట్స్

షూటింగ్ పూర్తిచేసుకొని, ఫస్ట్ కాపీతో సినిమా రెడీగా ఉందని అంతా అనుకున్నారు. కానీ భీమ్లానాయక్ సినిమా షూట్ ఇంకా పెండింగ్ ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు కొత్త షెడ్యూల్ మొదలైంది. కీలకమైన భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ ను పవన్ కల్యాణ్ పై చిత్రీకరిస్తున్నారు. ఈరోజు, రేపు ఈ సినిమా షూటింగ్ ఉంటుంది. పవన్ కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతోంది భీమ్లానాయక్ మూవీ. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ […]

Advertisement
Update:2022-02-13 12:19 IST

షూటింగ్ పూర్తిచేసుకొని, ఫస్ట్ కాపీతో సినిమా రెడీగా ఉందని అంతా అనుకున్నారు. కానీ భీమ్లానాయక్ సినిమా షూట్ ఇంకా పెండింగ్ ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు కొత్త షెడ్యూల్ మొదలైంది. కీలకమైన భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ ను పవన్ కల్యాణ్ పై చిత్రీకరిస్తున్నారు. ఈరోజు, రేపు ఈ సినిమా షూటింగ్ ఉంటుంది.

పవన్ కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతోంది భీమ్లానాయక్ మూవీ. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాయడంతో పాటు డైలాగ్స్ అందిస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే కొన్ని రిలీజయ్యాయి. త్వరలోనే మరో 2 సాంగ్స్ విడుదల చేయబోతున్నారు. ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈనెల 25 లేదా ఏప్రిల్ 1న భీమ్లానాయక్ ను విడుదల చేస్తామంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ రెండు తేదీల్లో ఒక డేట్ ను ఈ వారం ప్రకటించే ఛాన్స్ ఉంది.

Tags:    
Advertisement

Similar News