ప్రభాస్-మారుతి సినిమా.. రకరకాల పుకార్లు

ఈ మధ్య కాలంలో ప్రభాస్-మారుతి సినిమాపై వచ్చినన్ని పుకార్లు బహుశా మరో సినిమాపై వచ్చి ఉండవేమో. అలా రోజుకో పుకారుతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. ఇప్పటివరకు వచ్చిన రూమర్లకు తోడు ఇప్పుడు మరో 2 ఊహాగానాలు తెరపైకొచ్చాయి. అవేంటే చూద్దాం ప్రభాస్-మారుతి సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు పెట్టినట్టు ఇప్పటికే రూమర్లు వచ్చాయి. ఇప్పుడీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. వాళ్లలో ఒక హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా […]

Advertisement
Update:2022-02-08 16:31 IST

ఈ మధ్య కాలంలో ప్రభాస్-మారుతి సినిమాపై వచ్చినన్ని పుకార్లు బహుశా మరో సినిమాపై వచ్చి ఉండవేమో. అలా రోజుకో పుకారుతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. ఇప్పటివరకు వచ్చిన రూమర్లకు తోడు ఇప్పుడు మరో 2 ఊహాగానాలు తెరపైకొచ్చాయి. అవేంటే చూద్దాం

ప్రభాస్-మారుతి సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు పెట్టినట్టు ఇప్పటికే రూమర్లు వచ్చాయి. ఇప్పుడీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. వాళ్లలో ఒక హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా పేరును పరిశీలిస్తున్నారట. ఇక రొమాంటిక్-కామెడీ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని, ఇందులో ప్రభాస్ కు, హీరోయిన్లతో లిప్ కిస్సులు ఉంటాయని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇక మరో ఊహాగానం ఏంటంటే.. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకొచ్చి.. మినిమం గ్యాప్స్ లో పూర్తిచేస్తారట. మరీ ముఖ్యంగా ఓ భారీ సెట్ వేసి, అందులోనే 50శాతం షూటింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారట. ఇలా ప్రభాస్-మారుతి సినిమాపై రోజుకో పుకారు వినిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News