ఫిబ్రవరి 10 నుంచి ఏపీలో టికెట్ రేట్లు పెంపు?

టాలీవుడ్ కు గుడ్ న్యూస్ అందించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 10వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు రేపోమాపో జీవో రావొచ్చంటూ ప్రభుత్వ వర్గాల సమాచారం. కేవలం టికెట్ రేట్ల పెంపు మాత్రమే కాదు, పెద్ద సినిమాలకు రోజుకు 5 షోల వెసులుబాటు కల్పించే అవకాశం కూడా ఈసారి ఉండేలా ఉంది. వకీల్ సాబ్ రిలీజైన టైమ్ లో […]

Advertisement
Update:2022-02-06 16:38 IST

టాలీవుడ్ కు గుడ్ న్యూస్ అందించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 10వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు రేపోమాపో జీవో రావొచ్చంటూ ప్రభుత్వ వర్గాల సమాచారం. కేవలం టికెట్ రేట్ల పెంపు మాత్రమే కాదు, పెద్ద సినిమాలకు రోజుకు 5 షోల వెసులుబాటు కల్పించే అవకాశం కూడా ఈసారి ఉండేలా ఉంది.

వకీల్ సాబ్ రిలీజైన టైమ్ లో టికెట్ రేట్లు తగ్గించింది ఏపీ ప్రభుత్వం. సామాన్యుడికి టికెట్ రేట్లు అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయని టాలీవుడ్ పెద్దలు అభ్యంతరం వ్యక్తంచేశారు. తగ్గించిన టికెట్ రేట్లతో సినిమాలు ప్రదర్శించలేమని, గిట్టుబాటు కాదంటూ చాలా చోట్ల థియేటర్లు మూసేశారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి ప్రత్యేకంగా చొరవ తీసుకొని, సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఇంట్లో చిరంజీవికి మంచి అతిథ్యం దక్కింది. టాలీవుడ్ కు త్వరలోనే శుభవార్త రాబోతోందంటూ చిరంజీవి అదే టైమ్ లో ప్రకటించారు కూడా. ఇప్పుడా గుడ్ న్యూస్ మరో 4 రోజుల్లో వచ్చేలా ఉంది.

టికెట్ రేట్లపై ఏర్పాటైన కమిటీ ఈ మేరకు కొన్ని సూచనలు, సవరణలతో కూడిన జాబితాను ముఖ్యమంత్రికి అందించినట్టు సమాచారం. అయితే ఫ్లాట్ రేట్లపై మాత్రం కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పెద్ద సినిమాలు విడుదలైన తొలి వారం రోజులు ఫ్లాట్ రేట్లు పెట్టుకుంటున్నారు. శ్లాబులు, క్లాసులతో సంబంధం లేకుండా ప్రతి టికెట్ ను ఫ్లాట్ రేటుకు అమ్ముకుంటున్నారు. ఏపీలో దీనికి సంబంధించి టాలీవుడ్ కు అనుకూలంగా నిర్ణయం వస్తుందా రాదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Tags:    
Advertisement

Similar News