కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కోలుకోవడమే కాదు, ఏకంగా సెట్స్ లో ప్రత్యక్షమయ్యారు కూడా. తను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని, గాడ్ ఫాదర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశానంటూ స్వయంగా చిరంజీవి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆన్-లొకేషన్ స్టిల్స్ కూడా షేర్ చేశారు. గత నెల కరోనా బారిన పడ్డారు చిరంజీవి. టెస్టుల్లో తనకు పాజిటివ్ వచ్చిందని, ఐసొలేషన్ లోకి వెళ్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. అదే టైమ్ లో చిరంజీవి […]

Advertisement
Update:2022-02-06 16:35 IST

మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కోలుకోవడమే కాదు, ఏకంగా సెట్స్ లో ప్రత్యక్షమయ్యారు కూడా. తను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని, గాడ్ ఫాదర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశానంటూ స్వయంగా చిరంజీవి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆన్-లొకేషన్ స్టిల్స్ కూడా షేర్ చేశారు.

గత నెల కరోనా బారిన పడ్డారు చిరంజీవి. టెస్టుల్లో తనకు పాజిటివ్ వచ్చిందని, ఐసొలేషన్ లోకి వెళ్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. అదే టైమ్ లో చిరంజీవి తల్లి పుట్టినరోజు కూడా వచ్చింది. ఐసొలేషన్ లో ఉండడం వల్ల తల్లి పుట్టినరోజు వేడుకను కూడా జరుపుకోలేకపోయారు చిరు. ఆ బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు.

అలా అందరికీ దూరంగా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్న చిరంజీవి మరోసారి పరీక్షలు చేయించుకోగా.. ఈసారి నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. లొకేషన్ లో చిరంజీవి ఉత్సాహంగా ఉన్న స్టిల్స్ ను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం చిరంజీవి చేతిలో 4 సినిమాలున్నాయి. గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు బాబి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నారు. అటు దానయ్య నిర్మాతగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు చిరు.

Tags:    
Advertisement

Similar News