షాకిచ్చిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త విడుదల తేదీ

ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అంశంపై మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కుదిరితే మార్చి 18, కుదరకపోతే ఏప్రిల్ 28న థియేటర్లలోకి వస్తామని తెలిపారు. ఇప్పుడు ఆ రెండు తేదీలు కాకుండా, ఫ్రెష్ గా మరో తేదీ ప్రకటించారు. అవును.. ఆర్ఆర్ఆర్ ను మార్చి 25న విడుదల చేస్తామని ప్రకటించాడు దర్శకుడు రాజమౌళి. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్ట్ చేస్తున్న సినిమా కావడంతో […]

Advertisement
Update:2022-01-31 15:22 IST

ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అంశంపై మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కుదిరితే మార్చి 18, కుదరకపోతే ఏప్రిల్ 28న థియేటర్లలోకి వస్తామని తెలిపారు. ఇప్పుడు ఆ రెండు తేదీలు కాకుండా, ఫ్రెష్ గా మరో తేదీ ప్రకటించారు. అవును.. ఆర్ఆర్ఆర్ ను మార్చి 25న విడుదల చేస్తామని ప్రకటించాడు దర్శకుడు రాజమౌళి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్అర్ పై భారీ అంచనాలున్నాయి. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను ఇప్పటికే 2 సార్లు విడుదల చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. చివరిసారిగా సంక్రాంతి బరిలో జనవరి 7న విడుదల చేద్దాం అనుకున్నారు. భారీగా ప్రచారం కూడా చేశారు. కానీ కరోనా కేసులు పెరగడంతో మరోసారి వాయిదా బాట పట్టక తప్పలేదు.

అలా వాయిదాపడిన ఆర్ఆర్ఆర్ ను మార్చి 25న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం, ఫిబ్రవరి చివరి నాటికి భారత్ లోని చాలా ప్రాంతాల్లో కరోనా తగ్గిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలుస్తోంది. దీంతో ఈసారి ఆర్ఆర్ఆర్ వాయిదా పడే అవకాశాల్లేవ్. కచ్చితంగా మార్చి 25కి వచ్చేలా ఉంది.

అలియాభట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముత్తరఖని, శ్రియ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News