ఇంకా డైలమాలోనే భీమ్లా.. మరో 2 తేదీలు
ఓవైపు బడా సినిమాల విడుదల తేదీలన్నీ బయటకొస్తుంటే.. భీమ్లానాయక్ మేకర్స్ లో మాత్రం ఇంకా అదే డైలమా కొనసాగుతోంది. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాల విడుదల తేదీల్ని వరుసగా ప్రకటిస్తున్న వేళ.. అదే ఊపులో భీమ్లానాయక్ రిలీజ్ డేట్ కూడా వస్తుందని పవన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా జరిగింది. కానీ భీమ్లానాయక్ నిర్మాతలు మరోసారి తన సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వకుండా వదిలేశారు. తాజాగా నిర్మాతల […]
ఓవైపు బడా సినిమాల విడుదల తేదీలన్నీ బయటకొస్తుంటే.. భీమ్లానాయక్ మేకర్స్ లో మాత్రం ఇంకా అదే డైలమా కొనసాగుతోంది. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాల విడుదల తేదీల్ని వరుసగా ప్రకటిస్తున్న వేళ.. అదే ఊపులో భీమ్లానాయక్ రిలీజ్ డేట్ కూడా వస్తుందని పవన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా జరిగింది. కానీ భీమ్లానాయక్ నిర్మాతలు మరోసారి తన సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వకుండా వదిలేశారు.
తాజాగా నిర్మాతల నుంచి భీమ్లానాయక్ విడుదలకు సంబంధించి ప్రకటన వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవంటూనే, అన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ రిలీజ్ అవుతుందని, ఒకవేళ అలా కుదరని పక్షంలో ఏప్రిల్ 1న సినిమా థియేటర్లలోకి వస్తుందంటూ ప్రకటించారు. ఇలా భీమ్లానాయక్ విడుదల కోసం 2 తేదీలు ప్రకటించారు మేకర్స్.
ఇప్పుడున్న పరిస్థితుల్లో భీమ్లానాయక్, ఫిబ్రవరి 25కి రావడం కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే, అప్పటికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందనే గ్యారెంటీ లేదు. ఒకవేళ కరోనా తగ్గుముఖం పట్టినా, అప్పటికి ఏపీలో టికెట్ రేట్లు పెరుగుతాయనే గ్యారెంటీ లేదు. కాబట్టి ఏప్రిల్ 1కే భీమ్లానాయక్ ఫిక్స్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.