కోతల రాయుడు రెడీ అయిపోయాడు

రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. అందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించాడు. అతడి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో హీరోగా అతడు నటించిన ఓ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అఖండ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో వస్తున్న ఆ సినిమా పేరు కోతల రాయుడు. శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కోతల రాయుడు’. వెంకటరమణ మూవీస్ బ్యానర్ పై కొలన్ వెంకటేష్ […]

Advertisement
Update:2022-01-30 14:31 IST

రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. అందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించాడు. అతడి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో హీరోగా అతడు నటించిన ఓ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అఖండ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో వస్తున్న ఆ సినిమా పేరు కోతల రాయుడు.

శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కోతల రాయుడు’. వెంకటరమణ మూవీస్ బ్యానర్ పై కొలన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదలకానుంది. ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృద్వి, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ హైలెట్ అవుతాయని భావిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం థియేటర్లలో స్పేస్ ఎక్కువగా ఉంది. ఏ చిన్న సినిమా వచ్చినా కావాల్సినన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కోతలరాయుడికి మాత్రం ఆ అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ఆల్రెడీ కొన్ని సినిమాలు థియేటర్లలో కొనసాగుతుండగా.. ఫిబ్రవరి 4న మరో అరడజను సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోతలరాయుడు ఈ మేరకు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడో చూడాలి.

Tags:    
Advertisement

Similar News