సమంతదే తప్పు అంటున్న నాగార్జున

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఎవరి జీవితాలు వాళ్లు బతుకుతున్నారు. అయితే విడాకుల అంశం మాత్రం ఇప్పటికీ ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా విడాకులకు కారణం ఏంటనే అంశంపై ఎప్పటికప్పుడు కొత్త వాదోపవాదనలు తెరపైకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన కొడుకు, కోడలు విడాకులపై మరోసారి స్పందించాడు నాగార్జున. ఈసారి ఏకంగా సంచలన ఆరోపణలు చేశాడు. నాగచైతన్య, సమంత విడాకులపై స్పందించిన నాగార్జున.. విడిపోవాలనే నిర్ణయం పూర్తిగా సమంతదేనని ప్రకటించాడు. ముందుగా సమంత విడిపోవాలని […]

Advertisement
Update:2022-01-27 12:56 IST

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఎవరి జీవితాలు వాళ్లు బతుకుతున్నారు. అయితే విడాకుల అంశం మాత్రం ఇప్పటికీ ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా విడాకులకు కారణం ఏంటనే అంశంపై ఎప్పటికప్పుడు కొత్త వాదోపవాదనలు తెరపైకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన కొడుకు, కోడలు విడాకులపై మరోసారి స్పందించాడు నాగార్జున. ఈసారి ఏకంగా సంచలన ఆరోపణలు చేశాడు.

నాగచైతన్య, సమంత విడాకులపై స్పందించిన నాగార్జున.. విడిపోవాలనే నిర్ణయం పూర్తిగా సమంతదేనని ప్రకటించాడు. ముందుగా సమంత విడిపోవాలని నిర్ణయించుకుందని, ఆమెకు ఆమె ప్రయత్నాలు కూడా మొదలుపెట్టిందనేది నాగార్జున ఆరోపణ. సమంత తీసుకున్న నిర్ణయాన్ని నాగచైతన్య అంగీకరించాడని చెప్పుకొచ్చాడు.

అక్కినేని కుటుంబం పరువు-ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని నాగచైతన్య చాలా మథనపడ్డాడని చెప్పుకొచ్చాడు నాగార్జున. చాన్నాళ్లూ తనతో ఈ విషయం ఎలా చెప్పాలో అర్థంకాక నాగచైతన్య మానసిక వేదన అనుభవించాడని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా మరో గమ్మత్తైన విషయం కూడా బయటపెట్టాడు నాగ్. అసలు నాగచైతన్య-సమంత ఎందుకు విడిపోవాలని అనుకున్నారో తనకు ఇప్పటికీ తెలియదంటున్నాడు ఈ సీనియర్ హీరో. వాళ్ల ప్రైవసీని గౌరవించడం వరకు మాత్రమే తన బాధ్యత అన్నట్టు చెప్పుకొచ్చాడు.

Tags:    
Advertisement

Similar News