ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు
ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి మరోసారి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పేరు తెరపైకొచ్చింది. ఈసారి ఎన్టీఆర్ సరసన ఆమె తప్పకుండా నటిస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ మేరకు చర్చలు కూడా మొదలైనట్టు చెబుతున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ కోసం చాన్నాళ్ల కిందటే ఓ స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డైరక్టర్ అనిపించుకున్న బుచ్చిబాబు, ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ డ్రామా రాసుకున్నాడు. ఈ కథకు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడీ […]
ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి మరోసారి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పేరు తెరపైకొచ్చింది. ఈసారి ఎన్టీఆర్ సరసన ఆమె తప్పకుండా నటిస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ మేరకు చర్చలు కూడా మొదలైనట్టు చెబుతున్నారు.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఎన్టీఆర్ కోసం చాన్నాళ్ల కిందటే ఓ స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డైరక్టర్ అనిపించుకున్న బుచ్చిబాబు, ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ డ్రామా రాసుకున్నాడు. ఈ కథకు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి జాన్వి కపూర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రతి సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చేలా జాగ్రత్తపడుతున్నారు. ఇందులో భాగంగా బుచ్చిబాబు సినిమాకు కూడా పాన్ ఇండియా కలర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జాన్వి కపూర్ ఎంటరైతే, ఈ ప్రాజెక్టు రేంజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం జాన్వి కపూర్ తో సంప్రదింపులు స్టార్ట్ చేసిందట మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.
దాదాపు పదేళ్లుగా జాన్వి కపూర్ పై టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆమె తెలుగులో సినిమా చేయబోతోందనే ప్రచారం సాగుతూనే ఉంది. ఇప్పుడిలా ఎన్టీఆర్-బుచ్చిబాబు ప్రాజెక్టు కోసం మరోసారి ఆమె పేరు తెరపైకొచ్చింది. ఈసారి ఏమౌతుందో చూడాలి.