ఆర్ఆర్ఆర్.. 2 రిలీజ్ డేట్స్

ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త ప్రకటన వచ్చింది. అయితే అనూహ్యంగా ఈసారి 2 విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. దేశవ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సిన ఓ సినిమా, ఇలా 2 తేదీల్ని లాక్ చేయడంతో ఇతర సినిమాలు మరోసారి డైలమాలో పడ్డాయి. అయితే ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రకటించిన మొదటి తేదీ మార్చి 18. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు తగ్గి, థియేటర్లలో సాధారణ పరిస్థితులు […]

Advertisement
Update:2022-01-21 14:40 IST

ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త ప్రకటన వచ్చింది. అయితే అనూహ్యంగా ఈసారి 2 విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. దేశవ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సిన ఓ సినిమా, ఇలా 2 తేదీల్ని లాక్ చేయడంతో ఇతర సినిమాలు మరోసారి డైలమాలో పడ్డాయి. అయితే ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రకటించిన మొదటి తేదీ మార్చి 18. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు తగ్గి, థియేటర్లలో సాధారణ పరిస్థితులు నెలకొంటే ఈ తేదీకి సినిమా రిలీజ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఈ తేదీ నాటికి పరిస్థితులు సద్దుమణగకపోతే ఏప్రిల్ 28న థియేటర్లలోకి వస్తామంటూ మరో విడుదల తేదీ ప్రకటించారు. ఇలా ఒకేసారి 2 విడుదల తేదీలు ప్రకటించి మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. తాజాగా సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్, థర్డ్ వేవ్ కారణంగా ఇంకోసారి పోస్ట్ పోన్ అయింది. ఈసారి ఇలా మరోసారి వాయిదా అనే మాట వినిపించకుండా 2 రిలీజ్ డేట్స్ లాక్ చేశారు.

దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూశారు. ఈ నెలలో మరిన్ని షోలు వేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News