బంగార్రాజు సక్సెస్ ఎవరిది?

నిన్న థియేటర్లలోకి వచ్చింది బంగార్రాజు సినిమా. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన ఈ మూవీ ఎబోవ్-యావరేజ్ టాక్ దక్కించుకుంది. మరి ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరిది? ఇందులో ఇద్దరు హీరోలు నటించారు కాబట్టి ఇద్దరికీ సమానంగా ఆ క్రెడిట్ ఇవ్వాలి. కానీ ఈ మాట అంటే ఇటు నాగార్జున, అటు నాగచైతన్య ఇద్దరూ ఒప్పుకోవడం లేదు. క్రెడిట్ నాది కాదంటే నాది కాదు అంటున్నారు ఈ తండ్రీకొడుకులు. బంగార్రాజులో నాగచైతన్యలోని మాస్ […]

Advertisement
Update:2022-01-15 14:55 IST

నిన్న థియేటర్లలోకి వచ్చింది బంగార్రాజు సినిమా. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన ఈ మూవీ ఎబోవ్-యావరేజ్ టాక్ దక్కించుకుంది. మరి ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరిది? ఇందులో ఇద్దరు హీరోలు నటించారు కాబట్టి ఇద్దరికీ సమానంగా ఆ క్రెడిట్ ఇవ్వాలి. కానీ ఈ మాట అంటే ఇటు నాగార్జున, అటు నాగచైతన్య ఇద్దరూ ఒప్పుకోవడం లేదు. క్రెడిట్ నాది కాదంటే నాది కాదు అంటున్నారు ఈ తండ్రీకొడుకులు.

బంగార్రాజులో నాగచైతన్యలోని మాస్ యాంగిల్ చూశారని, ఈ సినిమా కోసం చైతూ చాలా కష్టపడ్డాడని మెచ్చుకున్నాడు నాగార్జున. ఈ సినిమా క్రెడిట్ మొత్తం చైతూదే అన్నాడు. అయితే చైతూ దీనికి రివర్స్ లో చెబుతున్నాడు. సినిమా మొత్తం బంగార్రాజు పాత్ర చుట్టూనే తిరిగింది కాబట్టి, సక్సెస్ క్రెడిట్ నాన్నకే ఇవ్వాలంటున్నాడు. అక్కడితో ఆగకుండా.. ఈ విజయాన్ని నాన్నకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించేశాడు కూడా.

ఇలా నాగచైతన్య, నాగార్జున ఇద్దరూ తమ సినిమా సక్సెస్ ను ఒకరు మరొకరికి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇదంతా వాళ్ల మధ్య ఉన్న ప్రేమ మాత్రమే. కొడుకు ఖాతాలో హిట్ వేద్దామని తండ్రి తాపత్రయం. చాన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తండ్రికి విజయం ఇచ్చేద్దామనేది కొడుకు ఆలోచన. అదన్నమాట సంగతి.

Tags:    
Advertisement

Similar News