కొడుక్కి నాగ్ ఇచ్చిన సలహాలు ఇవే!

తనయుడితో కలిసి సినిమా చేస్తున్నప్పుడు ఏ తండ్రికైనా కాస్త అదనపు భారం పడుతుంది. చరణ్ తో సినిమా చేసినప్పుడు చిరంజీవికి కూడా ఇదే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు నాగార్జున కూడా అలాంటి ఒత్తిడినే ఫీల్ అయ్యానని చెబుతున్నాడు. బంగార్రాజులో నాగచైతన్యతో కలిసి నటించిన నాగార్జున, చైతన్యను బంగార్రాజు పాత్రలోకి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. “నా బాడీ లాంగ్వేజ్ కోసం సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను చూడమని చైతూకి సలహా ఇచ్చాను. సీనియర్ బంగార్రాజు ఆత్మ లోపలకి […]

Advertisement
Update:2022-01-13 14:58 IST

తనయుడితో కలిసి సినిమా చేస్తున్నప్పుడు ఏ తండ్రికైనా కాస్త అదనపు భారం పడుతుంది. చరణ్ తో సినిమా చేసినప్పుడు చిరంజీవికి కూడా ఇదే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు నాగార్జున కూడా అలాంటి ఒత్తిడినే ఫీల్ అయ్యానని చెబుతున్నాడు. బంగార్రాజులో నాగచైతన్యతో కలిసి నటించిన నాగార్జున, చైతన్యను బంగార్రాజు పాత్రలోకి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు.

“నా బాడీ లాంగ్వేజ్ కోసం సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను చూడమని చైతూకి సలహా ఇచ్చాను. సీనియర్ బంగార్రాజు ఆత్మ లోపలకి ఎంట్రీ అయ్యాక బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ మారుతుంది. దాని కోసం చైతన్య డైలాగ్స్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి ఇచ్చేవాడిని. వాటిని చూసుకుంటూ చైతూ ఫాలో అయ్యాడు. అయితే నాకంటే ఆ యాస మీద కళ్యాణ్‌కు ఎక్కువ పట్టుంది. అంతా ఆయనే చూసుకున్నాడు. నేను ఎప్పటికప్పుడు టిప్స్ ఇచ్చాను.”

ఇలా నాగచైతన్య కోసం తను పడిన కష్టాన్ని బయటపెట్టాడు నాగార్జున. బంగార్రాజు సినిమాలో ప్రేక్షకులు నాగచైతన్య మాస్ యాంగిల్ ను చూస్తారని చెబుతున్నాడు నాగ్.

Tags:    
Advertisement

Similar News