విడాకులపై స్పందించిన నాగచైతన్య

తొలిసారి విడాకులపై స్పందించాడు నాగచైతన్య. సమంతతో విడిపోయిన తర్వాత గుంభనంగా ఉన్న ఈ అక్కినేని హీరో, ఎట్టకేలకు విడాకుల ప్రస్తావన తీసుకొచ్చాడు. సమంత, తను అంగీకారంతోనే విడిపోయామని చెప్పుకొచ్చిన చైతూ.. ఆ నిర్ణయం ఇద్దరికీ మంచి చేస్తుందని అభిప్రాయపడ్డాడు. “మా ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం అది. ఈ నిర్ణయంతో తను హ్యాపీగా ఉంది. నేను కూడా హ్యాపీ. మా సిచ్యుయేషన్ కు అదే బెస్ట్ డెసిషన్. కలిసి తీసుకున్న నిర్ణయం అది.” ఇలా తొలిసారి […]

Advertisement
Update:2022-01-12 13:39 IST

తొలిసారి విడాకులపై స్పందించాడు నాగచైతన్య. సమంతతో విడిపోయిన తర్వాత గుంభనంగా ఉన్న ఈ అక్కినేని హీరో, ఎట్టకేలకు విడాకుల ప్రస్తావన తీసుకొచ్చాడు. సమంత, తను అంగీకారంతోనే విడిపోయామని చెప్పుకొచ్చిన చైతూ.. ఆ నిర్ణయం ఇద్దరికీ మంచి చేస్తుందని అభిప్రాయపడ్డాడు.

“మా ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం అది. ఈ నిర్ణయంతో తను హ్యాపీగా ఉంది. నేను కూడా హ్యాపీ. మా సిచ్యుయేషన్ కు అదే బెస్ట్ డెసిషన్. కలిసి తీసుకున్న నిర్ణయం అది.”

ఇలా తొలిసారి విడాకులపై స్పందించాడు నాగచైతన్య. తను విడాకులు తీసుకుంటానని చెప్పినప్పుడు, కుటుంబం నుంచి తనకు మంచి సపోర్ట్ దక్కిందని చెప్పుకొచ్చాడు చైతూ. బంగార్రాజు సినిమా ప్రమోషన్ లో ఈ వ్యాఖ్యలు చేశాడు.

మరోవైపు ఏపీలో తగ్గించిన టికెట్ రేట్లపై కూడా చైతూ రియాక్ట్ అయ్యాడు. టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవో విడుదలైన టైమ్ కు బంగార్రాజు సినిమా సెట్స్ పైకి రాలేదని, తగ్గించిన టికెట్ రేట్లకు తగ్గట్టే బడ్జెట్ ను సెట్ చేసుకొని సినిమా పూర్తిచేశామని అన్నాడు.

Tags:    
Advertisement

Similar News