కారం పొడి వ్యాపారం చేసిన రానా

రానా ఎన్నో ప్రయోగాలు చేశాడనే సంగతి తెలిసిందే. గ్రాఫిక్స్, ఎడిటింగ్ సంస్థలను స్థాపించడం నుంచి మొదలుపెడితే చాలా వ్యాపారాలు చేశాడు రానా. ఆ తర్వాత కెరీర్ లో కూడా చాలానే ప్రయోగాలు చేశాడు. వివిధ భాషల్లో నటించాడు. హోస్ట్ గా కూడా మారాడు. విలన్ అవతారం కూడా ఎత్తాడు. అయితే రానా చేసిన వ్యాపారాల్లో ఇప్పటివరకు అతడు బయటపెట్టని వ్యాపారం ఒకటుంది. అదే కారం పొడి వ్యాపారం. అవును.. గుంటూరులో కారం పొడి వ్యాపారం చేశాడు రానా. […]

Advertisement
Update:2022-01-11 12:50 IST

రానా ఎన్నో ప్రయోగాలు చేశాడనే సంగతి తెలిసిందే. గ్రాఫిక్స్, ఎడిటింగ్ సంస్థలను స్థాపించడం నుంచి మొదలుపెడితే చాలా వ్యాపారాలు చేశాడు రానా. ఆ తర్వాత కెరీర్ లో కూడా చాలానే ప్రయోగాలు చేశాడు. వివిధ భాషల్లో నటించాడు. హోస్ట్ గా కూడా మారాడు. విలన్ అవతారం కూడా ఎత్తాడు. అయితే రానా చేసిన వ్యాపారాల్లో ఇప్పటివరకు అతడు బయటపెట్టని వ్యాపారం ఒకటుంది. అదే కారం పొడి వ్యాపారం.

అవును.. గుంటూరులో కారం పొడి వ్యాపారం చేశాడు రానా. అంటే కారం పొడి ప్యాకెట్లు అమ్మడం కాదు. మిరపకాయల నుంచి కారం తయారు చేసే ప్రాసెసింగ్ ప్లాంట్ అన్నమాట. చివరికి ఈ వ్యాపారం కూడా తను చేశానని, కానీ అది తనకు సూట్ అవ్వలేదని నష్టాలు వచ్చాయని చెప్పుకొచ్చాడు రానా. నటుడిగా కెరీర్ స్టార్ట్ చేయకముందే కారం పొడి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినట్టు తెలిపాడు.

రానా చేసిన వ్యాపారాల్లో ఇది కూడా ఉందనే విషయం చాలామందికి తెలియదు. స్వయంగా రానా ఈ విషయాన్ని బయటపెట్టాడు. బాలకృష్ణ చేస్తున్న టాక్ షోకు స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఈ నటుడు, ఇలా తన వ్యాపారాల చిట్టాను బయటపెట్టాడు. మరోవైపు తన గత జీవితంలో ప్రేమ వ్యవహారాలపై కూడా స్పందించాడు. గతంలో ఓ హీరోయిన్ తో డేటింగ్ చేశానని, కానీ వర్కవుట్ కాలేదని ఓపెన్ గా బయటపెట్టాడు.

Tags:    
Advertisement

Similar News