పవన్ కల్యాణ్ కొడుక్కి కరోనా

టాలీవుడ్ ను కరోనా ఊపేస్తోంది. చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. చివరికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న అకిరా లాంటి వాళ్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. అవును.. పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడి తల్లి రేణు దేశాయ్ స్వయంగా వెల్లడించారు. “చాన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నాం. నూతన సంవత్సర వేడుకలు కూడా ఇంట్లోనే. అయినప్పటికీ నాకు (రేణుదేశాయ్), అకిరాకు కొన్ని రోజుల కిందట కరోనా సోకింది. ప్రస్తుతం మేమిద్దరం […]

Advertisement
Update:2022-01-11 12:45 IST

టాలీవుడ్ ను కరోనా ఊపేస్తోంది. చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. చివరికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న అకిరా లాంటి వాళ్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. అవును.. పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడి తల్లి రేణు దేశాయ్ స్వయంగా వెల్లడించారు.

“చాన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నాం. నూతన సంవత్సర వేడుకలు కూడా ఇంట్లోనే. అయినప్పటికీ నాకు (రేణుదేశాయ్), అకిరాకు కొన్ని రోజుల కిందట కరోనా సోకింది. ప్రస్తుతం మేమిద్దరం కోలుకుంటున్నాం. ఈ మూడో వేవ్ ను సీరియస్ గా తీసుకోండి. మాస్కు ధరించండి, ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండండి.”

ఇలా తామిద్దరం కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రకటించింది రేణు దేశాయ్. గతేడాది తను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని, ఇప్పుడు అకిరాకు వ్యాక్సిన్ వేయించే టైమ్ కు కరోనా సోకడంతో, ఇంకొన్నాళ్లు ఎదురు చూడక తప్పదని ప్రకటించింది రేణు. సెకెండ్ వేవ్ లో పవన్ కల్యాణ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News